Commercial LPG cylinder | తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై టోల్ట్యాక్స్లు పెంచడంతోపాటు యూపీఐ పేమెంట్లపై చార్జీలు విధిస్తూ ప్రజలనుంచి డబ్బులు గుంజుతున్న కేంద్ర ప్రభుత్వం గుడ్డిలో మెళ్లలా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను స్వల్పంగా తగ్గించింది.
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై టోల్ట్యాక్స్లు పెంచడంతోపాటు యూపీఐ పేమెంట్లపై చార్జీలు విధిస్తూ ప్రజలనుంచి డబ్బులు గుంజుతున్న కేంద్ర ప్రభుత్వం గుడ్డిలో మెళ్లలా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను స్వల్పంగా తగ్గించింది. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధరలను సమీక్షిస్తున్న చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును (Cylinder Price) రూ.91.50 మేర తగ్గించాలని నిర్ణయించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (Domestic Cylinder) ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
తాజాగా తగ్గిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ రూ.2028కి తగ్గింది. ఇప్పటివరకు రూ.2,119.50గా ఉన్నది. ఇక కోల్కతాలో రూ.2221 నుంచి రూ.2132కు, ముంబైలో రూ.2071గా సిలిండర్ ధర రూ.1980కి, చెన్నైలో రూ.2268 నుంచి రూ.2176.5కు తగ్గింది. ఈ ఏడాది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండుసార్ల పెరిగాయి. మార్చి నెలలో రూ.350, జనవరిలో రూ.25 చొప్పన వడ్డించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

