Haryana: హర్యానాలో కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
Haryana: హర్యానాలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతిచెందారు. యమునానగర్, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మరణాలు నమోదు అయ్యాయి. దీంతో స్థానిక గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. లిక్కర్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
చండీఘడ్: హర్యానా(Haryana)లో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతిచెందారు. యమునానగర్, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మరణాలు నమోదు అయ్యాయి. దీంతో స్థానిక గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. లిక్కర్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో లింకున్న ఏడు మందిని పోలీసులు అరెస్టు చేశారు. మందేబరి, పంజెతో కా మజ్రా, పూస్‌ఘర్, సరన్ గ్రామాల్లో మరణాలు సంభవించాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. ప్రస్తుతం పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంబాలా జిల్లాలో యూపీకి చెందిన ఇద్దరు కార్మికులు గురువారం కల్తీ మద్యం తాగి మరణించారు. ఓ నిషేధిత ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న మద్యానికి చెందిన సుమారు 200 డబ్బాలను పోలీసులు సీజ్ చేశారు. లిక్కర్ తయారీకి వాడిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

