నగ్న చిత్రాలు, వీడియోలు పంపాలని.. బాలికను బలవంతం చేస్తున్న విద్యార్థి అరెస్ట్
బాలిక తండ్రికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన సైబర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాడు
న్యూఢిల్లీ: నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలని, లైంగికంగా చాటింగ్, ఇతర కార్యకలాపాల కోసం బాలికను బలవంతం చేస్తున్న విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నాడు. 14 ఏళ్ల బాలిక వ్యక్తిగత ఫొటోలను అతడు సంపాదించాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెను సంప్రదించి వాటిని పంపాడు. మరిన్ని నగ్న చిత్రాలు, వీడియోలు పంపాలని బ్లాక్మెయిల్ చేశాడు. సెక్సీగా చాట్ చేయాలంటూ బలవంతం చేశాడు. దీంతో ఆ బాలిక తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను అతడికి పంపుతున్నది.
కాగా, బాలిక తండ్రికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన సైబర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఐపీ అడ్రస్, మొబైల్ ఐఎంఈఐ నంబర్ ద్వారా ఆ విద్యార్థిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరింత మంది బాలికల నగ్న ఫొటోలు, వీడియోలు అతడి మొబైల్ ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి ట్రిక్స్‌తో యువతులను అతడు వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

