Nipah Virus: కేరళలో నిఫా.. బాధిత బాలుడి బంధువుల్లో 17 మందికి నెగటివ్, 19 మందికి చికిత్స
Nipah Virus: కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతని కుటుంబంతో టచ్‌లోకి వచ్చిన బంధువుల్లో 17 మందికి పరీక్షలో నెగటివ్ వచ్చింది.
మలప్పురం: కేరళలో నిఫా వైరస్(Nipah Virus) సోకి 14 ఏళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతని కుటుంబంతో టచ్‌లోకి వచ్చిన బంధువుల్లో 17 మందికి పరీక్షలో నెగటివ్ వచ్చింది. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడితో టచ్‌లో ఉన్న 17 మందికి చెందిన ఉమ్మి శ్యాంపిళ్లను టెస్ట్ కోసం పంపామని, అయితే వాటి ఫలితాల్లో వైరస్ లేనట్లు గుర్తించామన్నారు. మలప్పురంకు చెందిన కుర్రాడు గత ఆదివారం నిఫా సోకి మృతిచెందాడు.
మలప్పురంలో ఐసోలేషన్‌లో ఉన్నవారు 21 రోజుల పాటు క్వారెంటైన్‌ను కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య చట్టాల ప్రకారం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బంధువులకు నిఫా సోకకున్నా.. ఆ ప్రాంతంలో మాత్రం నిబంధనలు అమలులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఆంక్షలను ఇప్పుడు ఎత్తివేయలేమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల,ఇ ఎప్పుడూ పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

