Boy Murders Tutor | లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్.. హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్న బాలుడు
Boy Murders Tutor | లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్‌పై ఒక బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. కత్తితో పొడిచి హత్య చేశాడు. (Boy Murders Tutor) ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్‌పై ఒక బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. కత్తితో పొడిచి హత్య చేశాడు. (Boy Murders Tutor) ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 30న జామియా నగర్‌లోని బాటా హౌస్ ప్రాంతంలో అపార్ట్మెంట్లోని ఒక ఇంటి నుంచి రక్తం వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇంటి డోర్ బ్రేక్ చేసి లోనికి వెళ్లి చూశారు. ట్యూషన్ చెప్పే వ్యక్తి గొంతు కోసి అతడ్ని హత్య చేసినట్టు గ్రహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.
కాగా, పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. హత్యకు గురైన ట్యూటర్ స్వలింగ సంపర్కుడు. రెండు నెలల కిందట పరిచయమైన 14 ఏండ్ల బాలుడ్ని అతడు లైంగికంగా వేధించాడు. ఆ బాలుడితో పలుమార్లు స్వలింగ సంపర్కం చేశాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. తన మాట వినకపోతే వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.
మరోవైపు ఆగస్ట్ 30న తన ఇంటికి రావాలని ఆ బాలుడ్ని ట్యూటర్ పిలిచాడు. అయితే లైంగిక వేధింపుల పట్ల ఆగ్రహంతో ఉన్న ఆ బాలుడు ఆ ట్యూటర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. మధ్యాహ్నం 2.15 గంటలకు ట్యూటర్ ఇంటికి చేరుకున్నాడు. వెంట తెచ్చిన పదునైన కత్తితో ఆ వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ట్యూటర్‌ను హత్య చేసిన బాలుడ్ని శుక్రవారం అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

