ముంబైలో బయటపడిన 132 ఏండ్ల నాటి సొరంగం
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని జేజే ఆస్పత్రిలో 132 ఏండ్ల నాటి సొరంగం బయటపడింది. బ్రిటిష్ హయాంలో నిర్మించిన మెడికల్ వార్డులో ప్రస్తుతం నర్సింగ్ కాలేజ్‌గా మార్చిన భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని కనుగొన్నారు.
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని జేజే ఆస్పత్రిలో 132 ఏండ్ల నాటి సొరంగం బయటపడింది. బ్రిటిష్ హయాంలో నిర్మించిన మెడికల్ వార్డులో ప్రస్తుతం నర్సింగ్ కాలేజ్‌గా మార్చిన భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని కనుగొన్నారు. జేజే ఆస్పత్రి శిలాఫలకం ప్రకారం ఈ సొరంగం 1890లో నిర్మించారని తెలుస్తోంది.
వాటర్ లీకేజ్ ఫిర్యాదుపై తాము నర్సింగ్ కాలేజ్ భవనాన్ని సందర్శించామని, పీడబ్ల్యూడీ ఇంజనీర్లు, సెక్యూరిటీ గార్డులు బిల్డింగ్‌ను సర్వే చేయగా ఈ విషయం బయటపడిందని అధికారులు తెలిపారు. నర్సింగ్ కాలేజ్ ప్రాంగణంలో బేస్మెంట్ ఉండవచ్చని సిబ్బంది తెలిపిన మీదట తము తనిఖీలు చేపట్టగా సొరంగం బయటపడిందని చెప్పారు.
జేజే ఆస్పత్రి, గ్రాంట్ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈ నర్సింగ్ కాంప్లెక్స్ ఉంది. 1843లో గ్రాంట్ మెడికల్ కాలేజ్ భవనానికి శంకుస్ధాపన జరిగిందని శిలాఫలకంలో పొందుపరిచి ఉందని అధికారులు తెలిపారు. సొరంగంపై ప్రాధమిక పరిశోధన వివరాలను కలెక్టర్ కార్యాలయానికి, పురావస్తు శాఖకు సమర్పిస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

