Madhya Pradesh | డంపర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. 13 మంది సజీవదహనం
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్‌ను (Dumper) ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్‌ను (Dumper) ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు మంచి నిద్రలో ఉండటంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ఈ ప్రమాదం నుంచి నలుగురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ (Tarun Rathi) తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తొలగించామని, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

కాగా, బస్సు ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (CM Mohan Yadav) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

