King Cobra: కర్నాటక అడవిలో 12 అడుగుల కింగ్ కోబ్రా పట్టివేత.. వీడియో
King Cobra: సుమారు 12 అడుగుల పొడుగు ఉన్న కింగ్ కోబ్రాను కర్నాటకలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అగుంబే గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న ఆ సర్ఫాన్ని చాలా చాకచక్యంగా బంధించారు. అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసర్చ్ స్టేషన్లో ఫీల్డ్ డైరెక్టర్‌గా చేస్తున్న అజయ్ గిరి ఆ సర్పానికి చెందిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
బెంగుళూరు: సుమారు 12 అడుగుల పొడుగు ఉన్న కింగ్ కోబ్రా(King Cobra)ను కర్నాటకలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అగుంబే గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న ఆ సర్ఫాన్ని చాలా చాకచక్యంగా బంధించారు. అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసర్చ్ స్టేషన్లో ఫీల్డ్ డైరెక్టర్‌గా చేస్తున్న అజయ్ గిరి ఆ సర్పానికి చెందిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా కూడా ఆ వీడియోను షేర్ చేశారు.
ఆ పాము రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో స్థానికులు చూశారు. దీంతో అది ఓ ఇంటి కాంపౌండ్‌లోకి వెళ్లి చెట్టుపై దాక్కుకున్నది. గ్రామస్థులు వెంటనే అటవీ అధికారులను అలర్ట్ చేశారు. తమ బృందంతో గిరి ఆ ఇంటికి వచ్చి పామును పట్టేశారు. ఓ రాడ్డు సాయంతో చెట్టు మీద నుంచి పామును కిందకు దించి, ఆ తర్వాత రెస్క్యూ బ్యాగ్‌లోకి పంపించారు.
అజయ్ గిరికి ఇన్‌స్టాలో 13వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. పాములను రెస్క్యూ చేస్తున్న వీడియోలను అతను తరుచూ పోస్టు చేస్తుంటారు. కింగ్ కోబ్రాను పట్టుకున్న అజయ్ గిరిపై ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ప్రశంసలు వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

