Indefinite Hunger Strike: దల్లేవాల్కు మద్దతుగా 111 మంది పంజాబీ రైతుల నిరాహార దీక్ష
Indefinite Hunger Strike: పంజాబీ రైతు జగ్జీత్ సింగ్ దల్లేవాల్.. గత 50 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఇప్పుడు మరో 111 మంది రైతులు దీక్షకు పూనుకున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆ రైతులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ పంజాబీ రైతు జగ్జీత్ సింగ్ దల్లేవాల్.. గత 50 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష(Indefinite Hunger Strike) చేస్తున్నారు. హర్యానాలోని ఖనౌరి బోర్డర్ సమీపంలో ఆ 70 ఏళ్ల వృద్ధు రైతు దీక్ష చేస్తున్నాడు. ఆ రైతుకు తోడుగా ఇప్పుడు మరో 111 మంది పంజాబీ రైతులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. నల్ల దుస్తులు ధరించి ఇవాళ నిరసనకు దిగారు. రైతుల చేపడుతున్న ఆమరణ దీక్షను అడ్డుకునేందుకు హర్యానా బోర్డర్ సమీపంలో భారీగా పోలీసుల్ని మోహరించారు.
దల్లేవాల్ ఆమరణ దీక్ష నేటితో 51వ రోజుకు చేరుకున్నది. ఆయన కేవలం నీళ్లు సేవిస్తూ ఇన్నాళ్లు గడిపారు. ఇప్పుడు నీళ్లు తాగడం కూడా ఇబ్బందిగా మారినట్లు పంజాబీ రైతులు పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దల్లేవాల్ ఏమీ తినడం లేదని ఇటీవల రైతులు తెలిపారు.
సీనియర్ రైతు దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లుచెప్పారు. అతని కీటోన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మజిల్ మాస్ కూడా పడిపోయినట్లు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి 111 మంది రైతులు కొత్తగా ఆమరణ దీక్షకు దిగినట్లు రైతు నేత అభిమన్యు కోహర్ తెలిపారు. దల్లేవాల్ కన్నా ముందే తమ ప్రాణాలు బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ రైతులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

