Karnataka CM: 100 శాతం కోటా పోస్టును డిలీట్ చేసిన కర్నాటక సీఎం.. క్లారిటీ ఇచ్చిన కార్మిక శాఖ మంత్రి
Karnataka CM: ప్రైవేటు కంపెనీల్లో వంద శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కర్నాటక కొత్త బిల్లును రూపొందించింది. దాని గురించి సోషల్ మీడియాలో సీఎం సిద్ధరామయ్య చేసిన పోస్టు వివాదాస్పదమైంది. దీంతో ఆయన ఆ పోస్టును తొలగించారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి .. ఆ బిల్లుపై క్లారిటీ ఇచ్చారు.
బెంగుళూరు: ప్రైవేటు కంపెనీల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కోటాను రాష్ట్ర ప్రజలకే కేటాయిస్తున్నట్లు రూపొందించిన బిల్లుపై కర్నాటక సీఎం(Karnataka CM) సిద్ధరామయ్య తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో మంగళవారం ఓ పోస్టు చేశారు. ఆ పోస్టుపై వ్యతిరేకత రావడంతో.. దాన్ని ఆయన డిలీట్ చేశారు. అయితే ప్రైవేటు కంపెనీల్లోని నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 70 శాతం, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం స్థానిక రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోస్ లాడ్ క్లారిటీ ఇచ్చారు.
కన్నడ ప్రజలకే తమ ప్రభుత్వం అధిక అవకాశాలు ఇవ్వనున్నట్లు బిల్లుపై మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సీఎం ప్రకటించిన నిర్ణయం పట్ల వ్యాపారవేత్తల్లో సరైన స్పందన రాలేదు. బెంగుళూరులోని ఐటీ పరిశ్రమ ఆ నిర్ణయం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బయోకాన్ సీఈవో కిరణ్ మజుందార్ షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్కిల్డ్ లేబర్ విధానంపై విమర్శలు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని మరవరాదు అని ఆమె అన్నారు.
As a tech hub we need skilled talent and whilst the aim is to provide jobs for locals we must not affect our leading position in technology by this move. There must be caveats that exempt highly skilled recruitment from this policy. @siddaramaiah @DKShivakumar @PriyankKharge https://t.co/itYWdHcMWw
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

