న్యూఢిల్లీ, మార్చి 10: అగ్నివీరులకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్) ఉద్యోగ ఖాళీల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
అదేవిధంగా గరిష్ఠ వయోపరిమితిని సడలించడంతో పాటు శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మాజీ అగ్నివీరులకు మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. మొదటి బ్యాచ్ అగ్నివీరులకు ఈ వయసు సడలింపు ఐదేండ్లు ఉంటుందని, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేండ్లు ఉంటుందని హోంశాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నది.