కరోనా సోకిన వ్యక్తి ద్వారా.. 406 మందికి వైరస్ వ్యాప్తి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా నిబంధనలు, భౌతిక దూరం, లాక్డౌన్ వంటివి పాటించకపోతే కరోనా సోకిన వ్యక్తి ద్వారా నెల రోజుల్లో 406 మందికి వైరస్ వ్యాప్తిస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు. భౌతిక దూరం 50 శాతం మేర పాటిస్తే ఒక కరోనా రోగి ద్వారా నెల రోజుల్లో 15 మందికే వైరస్ సోకుతుందని తెలిపారు. భౌతిక దూరాన్ని 75 శాతం మేర పాటిస్తే ఒక కరోనా రోగి ద్వారా కేవలం 2.5 మంది మాత్రమే వైరస్ బారినపడతారని చెప్పారు.
ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు భౌతిక దూరమే ముఖ్యమని, మాస్కులు, శానిటైజర్లు వైరస్ వ్యాప్తి రిస్క్‌ను మాత్రమే తగ్గిస్తాయని డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. దయచేసి అనవసరంగా బయటకు వెళ్లవద్దని, ఇంట్లో కూడా కుటుంబ సభ్యులంతా మాస్కులు ధరించాలని, ఇతరులను ఇండ్లకు ఆహ్వానించవద్దని ఆయన సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

