చెన్నై, జూన్ 26: ఎంపీ కనిమొళి వివాదం నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్ డ్రైవర్ షర్మిలకు నటుడు కమల్‌హాసన్ అండగా నిలిచారు. కమల్ సాంస్కృతిక కేంద్రం తరఫున సోమవారం కారును గిఫ్ట్‌గా అందించారు.
‘డ్రైవర్ షర్మిల ఎంతోమంది యువతకు ఆదర్శం. ఆమెపై ఇటీవల జరిగిన చర్చను చూసి ఆవేదన చెందాను. షర్మిల ఓ డ్రైవర్‌గా మిగిలిపోకూదదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి. అందుకు ఈ కారు ఉపయోగపడుతుంది’ అని కమల్ అన్నారు. కోయంబత్తూర్ నుంచి తొలి మహిళా బస్ డ్రైవర్‌గా షర్మిల గుర్తింపు పొందారు.