ఆర్టీపీసీఆర్పై కేంద్రం యూటర్న్?

న్యూఢిల్లీ, మే 21: ఆర్టీపీసీఆర్ టెస్టులపై కేంద్రం యూ టర్న్ తీసుకొందా.. మొత్తం పరీక్షల్లో 70% ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉండాలని ఏప్రిల్లో ప్రధాని మోదీ రాష్ర్టాలకు చేసిన సూచనకు, కరోనా పరీక్షలపై కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన మార్గదర్శకాలకు మధ్య తేడా దీన్నే సూచిస్తున్నది. జూన్ చివరికి రోజువారీ టెస్టుల సంఖ్యను 45 లక్షలకు పెంచుతామని చెప్పిన కేంద్రం యాంటీజెన్ టెస్టులను గణనీయంగా పెంచుతామని పేర్కొంది. మరోవైపు వారం రోజులుగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య తగ్గుతున్నది. గతంలో రోజుకు 16 లక్షల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు అది 13 లక్షలకు పడిపోయింది. గురువారం 20.55 లక్షల పరీక్షలు చేస్తే అందులో ఆర్టీపీసీఆర్ టెస్టులు 10.6 లక్షలు ఉన్నాయి. ఇది మొత్తం టెస్టుల్లో 50 శాతం మాత్రమే. జూన్ చివరికి 45 లక్షల టెస్టుల లక్ష్యంతో యాంటీజెన్ పరీక్షలు పెంచితే ఆర్టీపీసీఆర్ వాటా 40 శాతానికి పడిపోతుంది. ఇది ప్రధాని సూచించిన సంఖ్యతో పోల్చితే చాలా తక్కువ. అయితే రోగులను త్వరగా గుర్తించి కరోనాను సాధ్యమైనంత వేగంగా కట్టడి చేయడం కోసమే యాంటీజెన్ పరీక్షలను పెంచుతున్నట్టు కేంద్రం చెప్తున్నది. మొత్తం పరీక్షలను ఆర్టీపీసీఆర్ విధానంలో చేస్తే రోజువారీ కేసులు సగటున 75-80 వేలు అధికంగా నమోదు కావచ్చని అంచనా.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

