– జులై 10న చేనేత సంఘ ఎన్నికలు
భూదాన్ పోచంపల్లి, జూన్ 29 : పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి ఎండీ.యూసఫ్ అలీ సోమవారం విడుదల చేశారు.
నామినేషన్ల స్వీకరణ : జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు
నామినేషన్ల పరిశీలన: జూలై 5
నామినేషన్ల ఉప సంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు : జులై 6
పోలింగ్, కౌంటింగ్ : జూలై 10. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
అనంతరం ఎన్నికల కౌంటింగ్ జరుగునని ఎన్నికల అధికారి తెలిపారు. సంఘంలో 9 మంది డైరెక్టర్లను రహస్య ఓటింగ్ పద్ధతిలో సభ్యులు ఎన్నుకుంటారని, ఇందులో ఇద్దరు మహిళా డైరెక్టర్లు, ఏడుగురిని జనరల్ కేటగిరీలో ఎన్నుకుంటారని ఆయన తెలిపారు.