కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 12 : కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ప్రధాన నేతాజీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు గడిచిన నేటికీ కాంటాలు వేయడం లేదని, కేంద్రాల వద్ద రైతులు ప డిగాపులు గాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు.
రైతులను మోసగిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందదన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో మోసం చేశారని, రైతు భీమాకు సంబంధించిన ప్రీమియమును డబ్బులు చెల్లించకుండా ఆగం చేసిందని అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పిఎసిఏస్ మాజీ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు బాతుక లింగస్వామి ,పెద్దల చక్రపాణి, నాయకులు సామ రవీందర్ రెడ్డి, నోముల మాధవరెడ్డి, పగిళ్ల రామ్ రెడ్డి,బత్తుల శ్రీశైలం, ఫకీరు సుధాకర్ రెడ్డి, మునుకుంట్ల బాలచంద్రం, అందెల హరీష్ యాదవ్, కo దా డి సుధాకర్ రెడ్డి, నక్కల రాజిరెడ్డి, పర్వతo అశోక్, మక్బూల్, కాసుల బాలరాజు ,గునిగంటి మల్లేష్, చే రాల చిన్న నరసింహ, దా రెడ్డి మల్లారెడ్డి, సార బాలయ్య, రంగ విశ్వనాథం, కలుకూరి శ్రీకాంత్ , కందాడి రఘుమారెడ్డి,యాకరీ నర్సింగ్ రావు, అయిత రాజు బిక్షపతి ,తంగేళ్ల దశరథ, మట్ట దర్శన్, నోముల ఉపేందర్ రెడ్డి, కర్ణాటి అంజమ్మ, రాజేశ్వరి, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

