బీబీనగర్, మార్చి 21 : బీబీనగర్ మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీని ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండారి రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దొంతిరెడ్డి కిరణ్ కుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గుంటిమిది జంగయ్య, తెల్చూరి సురేశ్ యాదవ్, యూత్ వింగ్ అధ్యక్షుడిగా అంబటి పరశురాం, ప్రధాన కార్యదర్శులుగా వడ్డబోయిన నవీన్, బుయ్య యోగేశ్వర్ గౌడ్ ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులను సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి శంకర్ గౌడ్, దొంతిరెడ్డి జంగారెడ్డి, దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జక్కి నగేశ్, జక్కి సంతోష్, సుర్వి జంగయ్యగౌడ్, పబ్బతి లక్ష్మయ్య, చింతల స్వామి, దొంతిరెడ్డి సత్తిరెడ్డి, రక్తని భిక్షపతి, రాపర్తి శ్రీశైలం పాల్గొన్నారు.

బీఆర్ఎస్ రాఘవపురం గ్రామ శాఖ నూతన కమిటీ