Munugode | పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి.. మునుగోడులో ఒంటిగంట తర్వాతే వైన్‌షాపులు ఓపెన్
Munugode | నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు.
Munugode | నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే విక్రయాలు మొదలు పెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని, సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతించొద్దని ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. స్థానికంగా ఉన్న వ్యక్తులే మద్యం టెండర్లు వేసి దక్కించుకునేలా ప్రోత్సహించారు. మద్యం టెండర్ల డ్రాలో కొన్ని మద్యం షాపులు స్థానికులు, మరికొన్ని స్థానికేతరులు దక్కించుకున్నారు.
మద్యం దుకాణాల యజమానులతో ఎమ్మెల్యే సమావేశం
మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్యం షాపులను మధ్యాహ్నం 1:00 తర్వాతనే తెరవాలని, 6 గంటల నుండి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని సూచించారు. ఎమ్మెల్యే సూచించిన అంశాలకు లోబడి మద్యం షాపులు నిర్వహిస్తామని నిర్వాహకులు మాట ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం కొత్త మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. ఎమ్మెల్యే సూచన మేరకు మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో నేడు ఊరి బయటే మద్యం దుకాణాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 1:00 గంట నుండి విక్రయాలు ప్రారంభించారు.
ఎమ్మెల్యే సంకల్పానికి మద్యం దుకాణ యజమానుల మద్దతు
ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే మద్యం వల్ల ఎంతోమంది యువకులు తాగుడుకు బానిసై తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న తీరు, కుటుంబాల విచ్చిన్నం చూసి చలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించారు. బెల్ట్ షాపులను నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధి నిధులు కేటాయించారు. దీంతో గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణ ఏర్పడి నియోజకవర్గ వ్యాప్తంగా క్రైమ్ రేటు తగ్గింది. కొత్తగా మద్యం టెండర్ల ప్రక్రియ మొదలవగానే టెండర్ల ప్రక్రియలోనే మునుగోడులో మద్యం షాపుల నిర్వహణ, మద్యం నియంత్రణపై సూచనలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయానికి మద్యం షాపుల యజమానులు తోడ్పాటును అందిస్తూ ముందుకొచ్చారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Jasprit Bumrah | టెస్టుల్లో బుమ్రా అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చోటు..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

