Kodada : ‘రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి’
కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సంఘాలు, తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు..
కోదాడ, నవంబర్ 26 : కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సంఘాలు, తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ పౌరులందరూ రాజ్యాంగ స్ఫూర్తితో దేశ అభివృద్ధి కృషి చేయాలన్నారు. రాజ్యాంగ ఆవిర్భావంతోనే దళితులకు సముచిత న్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పౌర హక్కులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమాల్లో గుండెపంగు రమేశ్, చీమ శ్రీనివాసరావు, కర్ణ సుందర్ బాబు, చింతా బాబు మాదిగ, చిన్ని మాదిగ, గంధం యాదగిరి, కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

