సబ్ పోస్ట్‌మాస్టర్ కాజేసిన నగదును చెల్లించాలి
తమ పొదుపు ఖాతాలు, డిపాజిట్ల నుంచి సబ్ పోస్ట్‌మాస్టర్ కాజేసిన నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం పైలాన్ కాలనీలోని పోస్టాఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ పైలాన్ కాలనీలోని పోస్టాఫీసులో తాము దాచుకున్న సుమారు రూ.1.5 కోట్ల రూపాయలను సబ్ పోస్ట్‌మాస్టర్ రామకృష్ణ కాజేసినట్లు తెలిపారు.
- పోస్టాఫీసు ఎదుట బాధితుల ధర్నా
నందికొండ, జూన్ 15 : తమ పొదుపు ఖాతాలు, డిపాజిట్ల నుంచి సబ్ పోస్ట్‌మాస్టర్ కాజేసిన నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం పైలాన్ కాలనీలోని పోస్టాఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ పైలాన్ కాలనీలోని పోస్టాఫీసులో తాము దాచుకున్న సుమారు రూ.1.5 కోట్ల రూపాయలను సబ్ పోస్ట్‌మాస్టర్ రామకృష్ణ కాజేసినట్లు తెలిపారు. విషయాన్ని డిసెంబర్లో గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, స్థానిక విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు.
విచారణ చేపట్టిన పోస్టల్, పోలీస్ అధికారులు ఖాతాదారుల డబ్బులను త్వరలో వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ఆరు నెలలు దాటినా నేటికీ జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అడిగితే పోస్టల్ అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు వస్తాయో రావోనని తీవ్ర మనోవేదనకు గురై ఓ ఖాతాదారుడు గుండా మల్లికార్జున గుండెపోటుతో మరణించాడని తెలిపారు.
ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోస్టల్ అధికారులపై చర్యలు తీసుకొని తమ ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో బాధితులు చిన్నయ్య, రవి, మధు, సంపూర్ణమ్మ, లక్ష్మి, చెన్నకేశవులు, సుబ్బారావు, శివ, సదాశివరెడ్డితోపాటు పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

