వాహనాలు కొనుగోలు చేయాలనే వారికి ఎలాంటి వెహికిల్స్ తీసుకోవాలో తెలియక పలు కంపెనీలను సందర్శించి ఆలోచన చేయాల్సి ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఒకే వేదికపై ఇంతటి గొప్ప అవకాశం కల్పించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆటో షో ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒకే దగ్గర అన్ని రకాల వాహనాలు ఉంచడం వాహన ప్రియులందరికీ మంచి అవకాశమన్నారు. సమాజంలోని పలు అంశాలపై వార్తలు ప్రచురించి ప్రజలను చైతన్యం చేస్తూనే మరో వైపు ఇలాంటి అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో ప్రజల్లో ఆర్థిక స్థోమత పెరిగి వాహనాలను కొనుగోలు చేసే శక్తి పెరిగిందని తెలిపారు. అలాంటి వారికి ఇలాంటి వేదికలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. వాహనాలు తీసుకున్న వారికి తక్షణం రుణం అందించేలా బ్యాంకులు, పైనాన్స్ సంస్థలను అందుబాటులో ఉంచడం సంతోషకరమని పేర్కొన్నారు. నల్లగొండ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆటో షో నిర్వహించడం గర్వకారణమన్నారు. అంతకుముందు నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ టి.మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్‌రెడ్డితో కలిసి ప్రదర్శనలో ఉంచిన బెంజ్, వోల్వో, ఆడీ కార్లతోపాటు 30 స్టాల్స్‌లోని కార్లు, బైకులు, ట్రాక్టర్లను జడ్పీ చైర్మన్ పరిశీలించారు. వాటి ఫీచర్స్, ధర, ఇతర అంశాలను తెలుసుకున్నారు.
రామగిరి, ఏప్రిల్ 7 : నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శని, ఆదివారం నిర్వహించిన మెగా ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వినియోగదారులు, సందర్శకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడిగా కనిపించింది. ఆయా కంపెనీల కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా బుకింగ్స్‌తోపాటు డెలివరీ అయ్యాయి. ఆదివారం రాత్రి 9 గంటల వరకు షో నిర్వహణ సాగడంతో విశేష స్పందన వచ్చింది. నల్లగొండలో తొలిసారి బెంజ్, వోల్వో, జీప్, ఆడీ వంటి పలు సంస్థల లగ్జరీ కార్లు ప్రదర్శనలో అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఆసక్తిగా పరిశీలించి ఫీచర్స్, ఆఫర్స్ తెలుసుకుని టెస్ట్ డ్రైవ్ చేశారు. మెగా షో నిర్వహించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యాలకు స్టాల్స్ నిర్వాహకులు, కస్టమర్లు కృతజ్ఞతలు తెలిపారు.
చాలా తక్కువ ధర రూ.9వేలు చెల్లిస్తే చాలు వెంటనే మా కంపెనీ వెహికిల్ అందజేస్తాం. మా కంపెనీ వాహనాలు మోడల్‌ను బట్టి లీటర్ పెట్రోల్‌కు 60 నుంచి 100 మైలేజ్ ఇస్తాయి. పెట్రోల్ వాహనాలే కాకుండా ఈవీ వెహికిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఒకసారి మా షోరూమ్‌కు కానీ, ఆటో షోలో ఉంచిన స్టాల్‌ను కానీ సందర్శిస్తే మా ప్రత్యేకతలు తెలుస్తాయి. ఆటో షోలో చాలా మంది మా స్టాల్‌ను సందర్శించి టెస్ట్ రైడ్ చేసి వాహనాలు బుకింగ్ చేసుకోవడం సంతోషంగా ఉంది.
– వి.యేజన్రెడ్డి, ఎల్వీ మోటార్స్ టీవీఎస్ ఎండీ, హైదరాబాద్ రోడ్, నల్లగొండ
మా కంపెనీ వాహనాలను అధికంగా వ్యవసాయదారులు, బిల్డర్స్‌తోపాటు ఇతరులు ఉపయోగిస్తారు. మరోవైపు లగ్జరీ సిరీస్‌లోనూ మా సంస్థ వాహనాలు అందిస్తున్నది. ఆటో షో చాలా బాగుంది. ఇక్కడ మా కంపెనీ వాహనాలకు మంచి ఆదరణ వచ్చింది. ఈ షోలో వాహనాలు తీసుకుంటే డిస్కాంట్ ఆఫర్స్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ నిర్వహిస్తే బాగుంటుంది.
– ఎస్.కృష్ణనాయక్, మహావీర్ ఇసుజు సేల్స్ టీం లీడర్, నల్లగొండ
వ్యవసాయ రంగంలో ఎంతో ఉత్తమంగా ఉపయోగపడేలా మా ట్రాక్టర్ ఉంటుంది. సుమారు 25 రకాల అంశాలతో ఉపయోగంలో ఉంటుంది. రోటవేటర్తోపాటు పత్తి చేనులో ఉపగించే వస్తువులు ఉన్నాయి. లీటరు డీజిల్‌తో సుమారు ఒక గంట పని చేసుకునే అవకాశం ఉంది. దీంతో రైతులకు శ్రమ, ఆర్థిక ఇబ్బంది తగ్గుతుంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మా స్టాల్ సందర్శించి ఒక రైతుగా మా ట్రాక్టర్ ఫీచర్స్ చూసి సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. చిన్న, సన్నకారు రైతులతోపాటు ఇతర రంగాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఉగాదికి ప్రత్యేక ఆఫర్స్ ఇస్తున్నాం.
– వి.రాజుచంద్ర, కెప్టెన్ ట్రాక్టర్ ఎండీ, నల్లగొండ
జిల్లా వ్యాప్తంగా టాటా మోటార్స్ వాహనాలకు మంచి ఆరదణ ఉంది. ఇదే క్రమంలో నమస్తే తెలంగాణ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో షోకు చాలా మంది హజరై వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మార్కెట్లో టాటా మోటార్స్ తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారికి కూడా చేరువ చేయాలన్నదే మా లక్ష్యం. దానికి నమస్తే తెలంగాణ తోడయ్యింది.
– యాకూబ్, టాటా మోటర్స్ సేల్స్ మేనేజర్
మార్కెట్లో సుజుకీ వాహనాలకు మంచి ఆదరణ ఉంది. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షోలో చాలా మంది హాజరై వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. తొలి రోజు 8 వరకు బుకింగ్స్ వచ్చాయి. నల్లగొండలో ఇలాంటి ఆటో షో నిర్వహణతో నమస్తే తెలంగాణకు, మా కంపెనీ వెహికిల్స్‌కు ఆదరణ వచ్చిందని భావిస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– బి.నరేశ్, కాసా సుజుకీ సేల్స్ మేనేజర్, వీటీకాలనీ, నల్లగొండ
మార్కెట్లో హీరో టూ వీలర్ వెహికిల్స్‌కు ఎంతో ఆదరణ ఉంది. కొత్తగా వచ్చిన ఈవీ వెహికిల్స్‌ను ఆటో షోలో అందుబాటులో ఉంచడంతో కస్టమర్లు వచ్చి చూసి బుకింగ్ చేసుకున్నారు. టెస్ట్ రైడ్ అవకాశం ఉండటంతో సౌకర్యంగా చూస్తున్నారు. ప్రత్యేక డిస్కౌండ్ సైతం ఇస్తున్నాం. ఎన్నో ఉత్తమ ఫీచర్స్ ఉన్న మా వాహనాలను ప్రజలు ఎక్కువగా కొంటారు. నమస్తే తెలంగాణ నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాలకు ఎంతో ఆదరణ వస్తుంది.
– ఎస్.జలెందర్, హీరో వెంకటరమణ మోటార్స్, డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, నల్లగొండ
హోండా బైకుల కొనుగోైళ్లపై ఎల్ఈడీ టీవీలతోపాటు కూలర్లు వంటివి ఆఫర్లు పెట్టాం. ఈ ఆటో షోలో యువత నుంచి మంచి స్పందన ఉంది. మా స్టాల్‌ను యువకులు పెద్ద ఎత్తున సందర్శించారు. హోండా బైకులు, స్కూటీలకు మంచి క్రేజీ ఉన్నందున గ్రామాల నుంచి సైతం యువకులు భారీగా తరలివచ్చారు.
– ఆర్.ప్రవీణ్, కుశాల్ హోండా షోరూం సేల్స్ మేనేజర్
కార్ల తయారీలో ఫ్రైడ్ హోండాకు ప్రత్యేకత ఉంది. ఫ్రైడ్ హోండాలో నూతన కారు ఎలివెట్ ఎస్వీ మోడల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. ఆటో షోలో మా స్టాల్‌కు ఎంతో మంది వచ్చి మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అవకాశాలు కల్పించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రిక యాజమాన్యాలకు ధన్యవాదాలు.
– దామోదర్‌రెడ్డి, ఫ్రైడ్ హోండా సేల్స్ మేనేజర్
కార్ల తయారీలో ఎంజీ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మా కంపెనీ అందించే అనేక మోడల్ వాహనాలకు మార్కెట్లో వినియోగదారుల నుంచి మంచి స్పందన ఉంది. ఆటో షోలో మా కంపెనీ స్టాల్ ఏర్పాటు చేశాం. తొలి రోజు మంచి డిమాండ్ వచ్చింది. చాలా మంది వచ్చి మా ఫీచర్స్, మా ప్రత్యేకతలు తెలుసుకుని సంతృప్తి చెందడంతోపాటు బుకింగ్ చేసుకున్నారు. మా కంపెనీ వాహనాలు ఉత్తమ మైలేజ్ ఇస్తాయి.
– వీరేంద్ర, ఎంజీ (మోరీస్ గ్యారేజ్) మోటార్స్ రిలేషన్ మేనేజర్, హైదరాబాద్, ఖమ్మం
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో చాలా బాగుంది. విశాలమైన మైదానంలో సుందరంగా ఏర్పాటు చేశారు. కస్టమర్లకు కనువిందు చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రైడ్ జీప్ సేల్స్ మేనేజర్‌గా మా కార్లు ప్రదర్శనకు తీసుకొచ్చాం. చాలా సంతోషంగా ఆన్నది. ఈసారి పబ్లిసిటీ చాలా బాగా చేశారు. రెస్పాన్స్ బాగున్నది.
– సాయి, ప్రైడ్ జీప్ సేల్స్ మేనేజర్
ఒకే దగ్గర అన్ని రకాల కంపెనీలకు చెందిన వాహనాలను చేర్చడం మంచి ఆలోచన. ఇలాంటి వేదికలు జిల్లా కేంద్రంలో మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కియా మోటార్స్ కంపెనీ కార్లకు తెలుగు రాష్ర్టాల్లో మంచి ఆదరణ ఉంది. రెండు రోజుల ప్రదర్శనలో తొలి రోజు ప్రజల నుంచి స్పందన బాగుంది. సుమారు 50 మంది వరకు మా స్టాల్స్‌ను సందర్శించి కారులోని ఫీచర్స్ అడిగి తెలుసుకున్నారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రతి వాహనం కొనుగోలుపై బంపర్ ఆఫర్ ఇస్తున్నాం.
– అజామ్, కియా మోటార్స్ సేల్స్ మేనేజర్
కార్ల తయారీలో స్కోడా కంపెనీకి ప్రత్యేకత ఉంది. స్కోడా కంపెనీ నుంచి వచ్చిన అనేక మోడల్ వాహనాలకు మార్కెట్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఆటో షోలో మా కంపెనీ స్టాల్‌ను ఏర్పాటు చేశాం. తొలి రోజు జిల్లావాసుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎంతో మంది కొత్త వినియోగదారులు మమ్మల్ని ఆశ్రయించారు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు, వినియోగదారులకు కృతజ్ఞతలు.
– భరత్‌కుమార్, స్కోడా సేల్స్ మేనేజర్
నల్లగొండ పట్టణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్‌పోలో మా స్టాల్‌ను అనేక మంది యువకులు సందర్శించడం సంతోషంగా ఉంది. మార్కెట్లో ఎంతో క్రేజ్ ఉన్నందున గ్రామాల నుంచి సైతం యువకులు భారీగా వచ్చి మా వాహనాలను టెస్ట్ రైడ్ చేశారు. కంపెనీకి మార్కెట్లో ఉన్న ఆదరణకు తోడు ఆటో షోలో మాకు అవకాశం రావడం సంతోషం.
– వినయ్‌కుమార్‌రెడ్డి, రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజర్
ఆటో షో ఏర్పాటుతో బైకులకు భలే గిరాకి వచ్చింది. చాలా మంది సందర్శకులు వచ్చారు. ఇలాంటి ప్రదర్శన చాలా బాగుంది. గతంలో నిర్వహించిన ఆటో షోలో కూడా మా కంపెనీ స్టాల్ ఏర్పాటు చేశాం. అప్పుడు మంచి అదరణ రావడంతో ఈసారి కూడా మా వాహనాలను ప్రదర్శనలో పెట్టాం. గతంలో కంటే ఈసారి బాగా ప్రచారం నిర్వహించారు. మా హోండా వాహనాలకు ప్రజల నుంచి ఆదరణ బాగుంది.
– సురేశ్, విఘ్నేశ్వర మోటార్స్, సేల్స్ మేనేజర్
వోల్వో కంపెనీ కార్లు సేఫ్టీకి ప్రసిద్ధ్ది. అలాగే లగ్జరీకి సింబల్. మా కంపెనీ నుంచి ఎన్నో ఫీచర్లు ఉన్న వాహనాలను ప్రదర్శనకు ఉంచాం. మా మోడళ్ల గురించి తెలుసుకోవాలనుకునే ఎంతో మంది మా స్టాల్‌ను సందర్శించారు. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కొనుగోలు చేసేందుకు అసక్తి ఉన్న వారి కోసం హైదరాబాద్ నుంచి డెమో వాహనాలను తీసుకొస్తాం. ఆటో షోలో మా స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది.
– సందీప్‌చంద్ర, వోల్వో మేనేజర్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు నిర్వహించిన ఆటో షో చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి ఆటో షోలో పాల్గొనేందుకు వచ్చాం. మా వాహనాలకు అధిక ధర ఉంటుంది. ఎక్కువగా హైదరాబాద్‌లోనే అమ్ముడుపోతాయి. ఈ సారి నల్లగొండకు రావడం సంతోషంగా ఉంది. వినియోగదారుల సౌలభ్యం కోసం అన్ని కంపెనీల వాహనాలను ఒకే చోటుకు తీసుకురావడం, బ్యాంకర్లను అందుబాటులో ఉంచడం అభినందనీయం.
– రవిక్రాంత్, మహావీర్ మోటార్స్ మేనేజర్, హైదరాబాద్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహించిన మెగా ఆటో షోలో నేను ఆదివారం సందర్శించి పలు కంపెనీల వాహనాలను పరిశీలించాను. నా భార్య వర్షిణిరెడ్డి కోరిక మేరకు ఆమెకు యాక్టివా డీలక్స్ ఇప్పించా. మంచి ఆఫర్లో వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఆటో షో నిర్వహించిన నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ మహేందర్ మాకు వాహనం అందించారు.
– జె.మాధవరెడ్డి, నల్లగొండ