ఇన్-సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్.. ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్టీఎఫ్ హర్షం
ఉపాధ్యాయులకు పెద్ద ఊరట. ఏటా జరిగే రెండు సాధారణ టెట్ (TET) లతో పాటు, ఇన్-సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించడానికి అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (మెమో నం. 2691/Ser.III/2026-2) జారీ చేయడం అత్యంత అభినందనీయమని..
రామగిరి, జూన్ 03 : ఉపాధ్యాయులకు పెద్ద ఊరట. ఏటా జరిగే రెండు సాధారణ టెట్ (TET) లతో పాటు, ఇన్-సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించడానికి అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (మెమో నం. 2691/Ser.III/2026-2) జారీ చేయడం అత్యంత అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ పేర్కొంది. 31 ఆగస్టు, 2028 లోగా ఇన్-సర్వీస్ టీచర్లందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని అపెక్స్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ గడువును దృష్టిలో ఉంచుకుని, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం టీఆర్టీఎఫ్ సహా పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లినందున ప్రత్యేక టెట్ నిర్వహణ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇన్-సర్వీస్ టీచర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతంగా టెట్ పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి తరాల పరమేశ్ యాదవ్ పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

