ఆర్వీ కర్ణన్ బాధ్యతల స్వీకరణ
నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి స్థానంలో బదిలీపై వచ్చి విధుల్లో చేరారు.
- నల్లగొండ కలెక్టర్‌గా విధుల్లో చేరిక
- శుభాకాంక్షలు తెలిపిన పలు శాఖల అధికారులు
నల్లగొండ ప్రతినిధి,జూలై26(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి స్థానంలో బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్‌గా టి.వినయ్ క్రిష్ణారెడ్డి స్థానంలో బదిలీపై వచ్చిన ఆర్.వీ.కర్ణన్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కర్ణన్‌ను సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళవారం నల్లగొండకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కలెక్టరేట్లో ఈవీఎంల ప్రదర్శన కేంద్రాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్.వీ.కర్ణన్‌ను జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో పి.శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎల్.శ్రీనివాస్, గనులు, భూగర్భశాఖ ఏడీ వెంకటేశ్వర్రావు, సర్వేలాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
బయోడేటా
పేరు : ఆర్.వీ.కర్ణన్.
జననం : 1985.
తల్లిదండ్రులు : వి.విజయలక్ష్మి, ఆర్.వీరరాఘవన్
స్వస్థలం : శ్రీరాంనగర్, కరైకుడి, శివగంగా జిల్లా.
తమిళనాడు.
సతీమణి : సీహెచ్. ప్రియాంక, సూర్యాపేట అదనపు కలెక్టర్
- 2012 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. సివిల్స్‌లో 158వ ర్యాంకు.
- 2007లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్ టాపర్.
- తొలుత ఊట్నూర్ ఐటీడీఏ పీడీగా తర్వాత మంచిర్యాల
కలెక్టర్‌గా బాధ్యతలు - ఖమ్మం కలెక్టర్‌గా 29 ఆగస్టు 2018 నుంచి 19 జూలై 2021
- కరీంనగర్ కలెక్టర్‌గా 19 జూలై 2021 నుంచి 26 జూలై (నిన్నటి) వరకు.
- 2023 జూలై 26 నుంచి నల్లగొండ కలెక్టర్‌గా బాధ్యతలు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

