సీనియారిటీ జాబితా సిద్ధం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు చకచకా సాగిపోతున్నది. సినియారిటీ, ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారీగా జాబితాలను జిల్లా విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది.
- ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారీగా జాబితాలు
- డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో వివరాలు
- రేపు హెచ్ఎం దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్
- ఈ నెల 15 ఆన్లైన్లో ప్రధానోపాధ్యాయుల బదిలీలు
రామగిరి,సెప్టెంబర్ 11: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు చకచకా సాగిపోతున్నది. సినియారిటీ, ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారీగా జాబితాలను జిల్లా విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది. ఆయా జిల్లాలోని డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించిన రీ షెడ్యూల్ ప్రకారం తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరుగనుండగా, వాటికి అవసరమైన సీనియారిటీ, ఖాళీల వివరాలను విడుదల చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. బదిలీలకు సంబంధించి పూర్తిస్థ్ధాయి సీనియారిటీ జాబితాలను ఆర్జేడీ, డీఈఓలు బుధవారం వెల్లడించనున్నారు. హెచ్ఎం బదిలీలకు దరఖాస్తుల చేసిన వారికి గురువారం ఎడిట్‌కు అవకాశం కల్పించారు. వారికి ఈ నెల 15న ఆన్లైన్లో సీనియారిటీ జాబితా సిద్ధం15న ఆన్లైన్లోబదిలీల ప్రక్రియ నిర్వహించనున్నారు.
డీఈఓ వెబ్సైట్లో జాబితాలు..
నల్లగొండ జిల్లాల్లో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన తాత్కాలిక జాబితాను http://deonalgonda.blogspot.com వెబ్సైట్లో లోకల్‌బాడీ, ప్రభుత్వ పాఠశాలల వారీగా అందుబాటులో ఉంచారు. అదే విధంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఉర్దు, గణితం, భౌతిక, జీవశాస్త్రం, సాంఘీక శాస్త్రం, పీఈడీ సబ్జెక్టులకు సంబంధించి ప్రిఫరెన్షియల్ కేటగిరి, సర్వీస్ పాయింట్స్, ఇంటర్నల్ పాయింట్స్‌తో జాబితాలు వెల్లడించారు. వీటిపై బుధవారం అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గెజిటెడ్ హెడ్మాస్టార్ల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 14న ఎడిట్ ఆప్షన్స్ కల్పించారు. 15న ఆన్లైన్ ద్వారా బదిలీలు చేయనున్నారు.
మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు
శాలిగౌరారం, సెఫ్టెంబర్ 12 : మండలంలోని మోడల్స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాగిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

