జోహార్ సాయిచంద్
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
- ఉద్యమ కళాకారుడి ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి
- జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సాయిచంద్‌కు నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలో ఫామ్‌హౌస్ ఉంది. బుధవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సాయిచంద్ మృతి విషయం తెలిసిన సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర మంత్రులు సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించి, కంటతడి పెట్టారు. సాయిచంద్ మరణవార్త విని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కళాకారులు గుర్రంగూడలోని ఆయన స్వగృహానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వనస్థలిపురం సాహెబ్ నగర్‌లోని శ్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. గుర్రంగూడ నుంచి సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర ముందు కళాకారులు ‘సాయిచంద్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ పాటలతో ఆయన్ని గుర్తు చేసుకున్నారు.
– సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ)







Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

