అహింసే ఆయుధం
అహింసా అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కలలు సాకారం చేస్తూ నాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మూడో తరానికి తెలియజేందుకు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణం బస్టాండ్ కూడలిలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. బారిస్టర్ చదివేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన మహాత్మాగాంధీ అక్కడ వర్ణ వివక్షను ఎదుర్కొన్నాడని
- ప్రపంచానికి సరికొత్త సిద్ధాంతాన్ని అందించిన గాంధీజీ : మంత్రి జగదీశ్‌రెడ్డి
చౌటుప్పల్, ఆగస్టు16 : అహింసా అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కలలు సాకారం చేస్తూ నాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మూడో తరానికి తెలియజేందుకు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణం బస్టాండ్ కూడలిలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. బారిస్టర్ చదివేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన మహాత్మాగాంధీ అక్కడ వర్ణ వివక్షను ఎదుర్కొన్నాడని, తాను పడ్డ బాధలు దేశప్రజలు పడొద్దనే అహింసా మార్గం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారని గుర్తుచేశారు.
సాయుధ పోరాటంలో ఎంతో మంది స్వాతంత్య్ర యోధులు బలైపోవడం చూసి ఆయన చలించిపోయారని, అందుకే అహింసా మార్గాన్ని ఎంచుకొని పోరాటం కొనసాగించారని తెలిపారు. విభిన్న మతాలు, ఆచారాలను ఏకం చేసి తెచ్చిన స్వాతంత్య్రం ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నామని చెప్పారు. 780 సంస్థాలను విలీనం చేసి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి దేశానికి స్వాతంత్య్రాన్ని గాంధీజీ తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి గొప్ప పోరాట యోధుడైన గాంధీజీని అగౌరవ పరిచేలా కొన్ని దుష్టశక్తులు పయత్నిస్తున్నాయని, వీటికి చరమగీతం పాడి స్వాతంత్య్ర సంగ్రామాన్ని నేటి తరానికి అందించాలనే సంకల్పంతో వజ్రోత్సవానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో దేశభక్తి మరింత పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, ఇన్చార్జి డీసీపీ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఆర్డీఓ ఎస్.సూరజ్‌కుమార్, సంస్థాన్‌నారాయణపురం ఎంపీపీ, జడ్పీటీసీలు గుత్తా ఉమ, వీరమళ్ల భానుమతి, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

