తాలు పేరుతో తరుగు.. రైతులను దోచుకుంటున్న మిల్లర్లు
అన్నదాతలను మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాలు పేరుతో ఐదు నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. మండలంలోని మునుకుంట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 164 మంది రైతులు తమ ధాన్యాన్ని రాసులుగా పోశారు.
- లారీల కొరతతో కొనుగోళ్లలో జాప్యం
- కొనుగోలు కేంద్రాల్లో అరిగోస పడుతున్న అన్నదాతలు
కట్టంగూర్, మే 13 : అన్నదాతలను మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాలు పేరుతో ఐదు నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. మండలంలోని మునుకుంట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 164 మంది రైతులు తమ ధాన్యాన్ని రాసులుగా పోశారు. మిల్లర్ల కొర్రీలతో కొనుగోళ్లు మందకొడిగా జరుగుతుండటంతో రైతులు రాత్రి, పగలు రాసుల వద్దే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీల కొరత కూడా తోడవడంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 45 రోజులు దాటినా ఇప్పటివరకు 22 మంది రైతుల ధాన్యా న్ని కాంటా వేసి 12 లారీల ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించారు.
క్వింటాకు 5 నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. వారానికి ఒక్క లారీ మాత్రమే రావడంతో ధాన్యం తరలింపు నత్తనడకన సాగుతోంది. రైతులే లారీలు తెచ్చుకుంటే వారి ధాన్యాన్ని మాత్రం కాంటా వేపి మిల్లులకు తరలిస్తున్నారు. లోడింగ్ చేసిన లారీలు మిల్లుల వద్దకు చేరిన తరువాత ఐదు నుంచి ఆరు రోజుల వరకు దిగుమతులు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లు షార్టేజీ పేరుతో మూడున్నర క్వింటాళ్ల వరకు ధాన్యాన్ని కటింగ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ మండల స్థాయి అధికారి కూడా కేంద్రాన్ని సందర్శించి తమ సమస్యలు తెలుసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

