పెన్‌పహాడ్‌లో అధిక ధరలకు మద్యం విక్రయాలు
పెన్‌పహాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వైన్స్ నిర్వాహాకులు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా రూ.10 వసూళ్లకు పాల్పడుతూ మద్యం ప్రియులను నిలువు దోపిడి...
పెన్‌పహాడ్, నవంబర్ 05 : పెన్‌పహాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వైన్స్ నిర్వాహాకులు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా రూ.10 వసూళ్లకు పాల్పడుతూ మద్యం ప్రియులను నిలువు దోపిడి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని త్రిశూల వైన్స్ లో జరుగుతున్న ఈ బహిరంగ దోపిడీపై గురువారం దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్య ప్రవీణ్ అనే వ్యక్తి తన గోడు వెల్లబోసుకోగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. భూక్య ప్రవీణ్ తన ఇంట్లో జరిగే శుభకార్యం నిమిత్తం మద్యం కొనుగోలు చేయడానికి గురువారం వైన్స్‌కు వెళ్లాడు.
అయితే అక్కడ కౌంటర్ లో ఉన్న సిబ్బంది ప్రతి సీసాపై ఎమ్మార్పీ రేటు కంటే అదనంగా రూ.10 చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పినట్లు ఆయన ఆరోపించాడు. ప్రభుత్వ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ఎందుకు ఇవ్వాలని నిలదీయగా… అదనపు డబ్బులు ఇస్తేనే సరుకు ఇస్తామని, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చినట్లు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదని, ప్రతిరోజూ వందలాది మంది మద్యం వినియోగదారులపై జరుగుతున్న నిలువు దోపిడీ అని ఆయన మండిపడ్డారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- liquor
- Penpahad
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్‌పహాడ్‌లో అధిక ధరలకు మద్యం విక్రయాలు
Madhusudana Chary | కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.. రేవంత్‌ది సర్వ భ్రష్ట ప్రభుత్వం : మధుసూదనా చారి
Cristiano Ronaldo | ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో..!
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

