గుర్రంపోడు, మార్చి 29: గుర్రంపోడు మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన కట్ట అయోధ్య రాములు కరాటేలో సత్తా చాటాడు. షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో అదరగొట్టి బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ దక్కించుకున్నాడు. ప్రముఖ సినీ హీరో, కరాటే లెజెండ్ హన్షీ డాక్టర్ సుమన్ తల్వార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అయోధ్య రాములుకు బ్లాక్ బెల్ట్, సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తమ గ్రామ యువకుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం పట్ల కట్టవారిగూడెం సర్పంచ్ చాడ ప్రమీల చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. కట్ట అయోధ్య రాములు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొల్గొన్న షావోలిన్ షోటోకాన్ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ నాంపల్లి కనకారావు (7వ డాన్), జనరల్ సెక్రటరీ సింధు లవకుమార్, కట్ట రామచంద్రమ్మ, కట్ట మాధవి తదితరులు రాములను అభినందించారు.
ఉప సర్పంచ్ పర్సనబోయిన రాధ వెంకన్న, పాలక వర్గం, గ్రామస్థులు కట్ట శ్రీశైలం, కట్ట రామకృష్ణ, కట్ట వెంకన్న, మాదగోని నర్సింహ, కట్ట లింగయ్య, అఫ్జల్, కట్ట కొండయ్య, తదితరులు బ్లాక్‌బెల్ట్ సాధించి ఊరంతా గర్వపడేలా చేసిన రాములును అభినందించారు.