బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకుల విక్రయం!
నల్లగొండ పట్టణంలోని పలు దుకాణాల్లో బుధవారం కాపీ రైట్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యతా లేని విద్యుత్ వైర్లు అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు, వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు.
- నల్లగొండలో కాపీ రైట్స్ అధికారుల తనిఖీ
నీలగిరి, జూలై 24 : నల్లగొండ పట్టణంలోని పలు దుకాణాల్లో బుధవారం కాపీ రైట్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యతా లేని విద్యుత్ వైర్లు అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు, వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు.
ప్రకాశం బజార్‌లోని హనుమాన్ ఎలక్ట్రికల్ దుకాణంలో నిర్వాహకులు గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతాలేని కరెంటు వైర్లు అమ్ముతున్నట్లు అందిన సమాచారంతో సోదాలు చేసి దాదాపు రూ.22 లక్షల విలువైన 16 వైర్ల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పట్టణంలోని షేర్బంగ్లాలో పద్మావతీ కిరాణం జనరల్ స్టోర్‌లో స్టీవ్వెల్ కంపెనీ పేరుతో నకిలీ అగర్బత్తులు దాదాపు 1.21 లక్షల విలువైన ఏడు బాక్స్‌లను స్వాధీనం చేసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
అనంతరం వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యత లేని వస్తువులను ప్రజలకు హానీ కలిగించే వస్తువులను అమ్ముతున్న మదన్, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐపీ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇజ్రార్, ఎస్ఐలు సందీప్‌రెడ్డి, శంకర్, కాపీరైట్ అధికారులు ఇక్బాల్ ఖద్రి, దినేశ్ శెట్టి, సంతోష్, దీపక్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

