Thungathurthy : అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుంగతుర్తి పంచాయతీకి ఫ్రీజర్ అందజేత
అక్షర ఫౌండేషన్, సూర్యాపేట ఆధ్వర్యంలో ఎస్ కె ఆర్ కన్స్ట్రక్షన్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి బాడీ ఫ్రీజర్ బాక్స్ సంకినేని రవీందర్ రావు అందజేశారు. సోమవారం మండల కేంద్రంలోని
తుంగతుర్తి, డిసెంబర్ 29 : అక్షర ఫౌండేషన్, సూర్యాపేట ఆధ్వర్యంలో ఎస్ కె ఆర్ కన్స్ట్రక్షన్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి బాడీ ఫ్రీజర్ బాక్స్ సంకినేని రవీందర్ రావు అందజేశారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉచిత ఫ్రీజర్‌ను అందజేసి మాట్లాడారు. ప్రతి ఒక్కఉ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఫ్రీజర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైకుంఠదామ యాత్ర వాహనం త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తుంగతుర్తి, పరిసర గ్రామాల ప్రజలకు ఫ్రీజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రీజర్‌ను అందజేసినట్లు వెల్లడించారు.
విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న అక్షర ఫౌండేషన్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అక్షర ఫౌండేషన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫ్రీజర్ కావాల్సిన వారు 95159 38163, 7036259922 నంబర్లను సంప్రదించి తీసుకు వెళ్లవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబు, ఉప సర్పంచ్ యలగందుల శ్రీను, పంచాయతీ కార్యదర్శి మడిపెద్ది శ్రీనివాస్, నారాయణదాసు నాగరాజు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

