నకిరేకల్,ఫిబ్రవరి 3 : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.