Nalgonda : సాగు నీరందించాలని తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల రైతుల ఆందోళన
ఏఎంఆర్పీ డీ39, డీ40 కాల్వల ద్వారా తమ భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. నీటి పారుదల శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈఈకి, కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు.
నల్లగొండ, ఆగస్టు 04 : ఏఎంఆర్పీ డీ39, డీ40 కాల్వల ద్వారా తమ భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. నీటి పారుదల శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈఈకి, కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఏఎంఆర్పీ కాల్వ ద్వారా నీళ్లు అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
ఓవైపు బ్రాహ్మణ వెల్లంల, అయిటిపాముల కాల్వలకు పూర్తిస్థాయిలో నిరంధిస్తూ తిప్పర్తి, మాడ్గులపల్లి ప్రాంత మండలాల రైతుల పట్ల పక్షపాతం వహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారబంది అమలు చేస్తున్నామంటూ.. అధికారులు పూర్తిస్థాయిలో తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాలకు వచ్చే కాల్వలకు నీరు వదలడం లేదన్నారు. అయిటిపాముల బ్లాక్ వెళ్లే షెటర్లు కొంతమంది దుండగులు ధ్వంసం చేసినా అధికారులు వాటిని రిపేర్ చేయించకుండా తాత్సర్యం చేస్తున్నట్లు చెప్పారు. తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాలకు సాగునీరు అందక, చెరువులు, కుంటల్లో నీరు లేక భూగర్భ జలాలు పడిపోయాయని, బోర్లు పోయక పొలాలు ఎండిపోయే స్థితికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల గోస పట్టని మంత్రి వెంకట్‌రెడ్డి
తిప్పర్తి మండలం తనకు గుండెకాయ లాంటిదని చెప్పే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ ప్రాంత రైతుల గోస కనపడట్లేదా లేక వినిపించడం లేదా అని తీవ్రంగా విమర్శించారు. మంత్రి నిర్లక్ష్యం వల్ల వందల టీఎంసీలు సాగర్ నుండి సముద్రం పాలవుతున్నా, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పూర్తిస్థాయిలో పానగల్ ఉదయ సముద్రానికి నీరు అందించడం లేదని మండిపడ్డారు. అధికారులు అక్కంపల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నీటి విడుదలకు సంబంధించి తప్పుడు లెక్కలు చెబుతున్నారని, మంత్రికి ఏమాత్రం అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, D39-D40 కాల్వల ద్వారా చివరి భూముల వరకు పూర్తిస్థాయిలో నీరంధించి, చెరువు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల లక్ష్మయ్య, ముకిరాల కృష్ణ, గుండెబోయిన రామచంద్రు, గుండెబోయిన నాగరాజు, దేవిరెడ్డి లింగారెడ్డి, బొల్లెద్దు వెంకన్న, అంతటి చెన్నకేశవులు, చింతకుంట దయాకర్‌రెడ్డి, కె. సురేందర్ రెడ్డి, చెదురుపల్లి జనార్ధన్, చిన్నగోని వెంకన్న, రొట్టెల జానయ్య, జక్కలి రవి, కట్ట బిట్టుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Nalgonda : సాగు నీరందించాలని తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల రైతుల ఆందోళన
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

