నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా ఆటో షోలో సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒకే వేదికపై వివిధ కంపెనీల కార్లు, బైక్‌లు ఉంచడంతో నమస్తే తెలంగాణకు అభినందనలు తెలిపారు. ఆటో షోకు మంచి ఆదరణ వచ్చిందని స్టాల్స్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
– రామగిరి/ నల్లగొండ సిటీ / నల్లగొండ రూరల్, ఏప్రిల్ 6
మార్కెట్లో మా కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ధరలో న్యూ మోడల్స్‌లో కార్లు ఉన్నాయి. నమస్తే తెలంగాణ నిర్వహించిన ఆటో షోలో సందర్శకులు మా స్టాల్‌ను అత్యధికంగా సందర్శించడంతో మార్కెట్లో మంచి గుర్తింపు వచ్చింది. టెస్ట్ డ్రైవ్ చేసి మా కార్లలోని ఫీచర్స్‌ను, సౌకర్యాలను చెక్ చేసుకుంటున్నారు. ఆదివారం సందర్శకుల తాకిడి మరింత పెరుగుతుంది. ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం
– క్రాంతికుమార్, హుండాయ్ సాన్సూయి
ల్లగొండ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ నిర్వహించిన ఆటో షో బాగుంది. సందర్శకులు ఫీచర్స్‌ను తెలుసుకుని వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అతి తక్కువ ధరకు మా కంపెనీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. మంచి సెఫ్టీ ఫీచర్స్ మా కార్లలో ఉన్నాయి. అందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బుకింగ్ కోసం మా స్టాల్‌ను సందర్శించాలి. మోడల్స్‌ను బట్టి మంచి ఆఫర్స్ ఇస్తున్నాం. అందరూ ఉపయోగించుకోవాలి.
– పి.రాకేశ్, ప్రైడ్ సిట్రిన్ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, నల్లగొండ
మా కంపెనీ అందజేసే కార్లలో ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ ప్రత్యేకం. అయితే ఒకే దగ్గర అన్ని రకాల కంపెనీలకు చెందిన వాహనాలు చేర్చడంతో ప్రజలు వచ్చి వాటి ప్రత్యేకతలు చూసి నచ్చిన కార్లు కొంటారు. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా మంచి ఉత్తమమైన ఫీచర్స్‌తో వివిధ మోడల్స్‌లో మా కంపెనీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిఒక్కరూ మా స్టాల్స్ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని బుకింగ్స్ సైతం వచ్చాయి.
– ఎన్.సందీప్‌కుమార్, హర్ష టయోటా సేల్స్ జీఎం, నల్లగొండ
నేటి ఆధునిక కాలంలో చదువుతోపాటు ప్రాక్టికల్ అంశాలపై పట్టు సాధించాలి. బీకాం, బీబీఏ విద్యార్థులు వారి సబ్జెక్టుల్లోని మార్కెటింగ్, ఇతర కామర్స్ విలువలను తెలుసుకుని సర్వేలు చేయడానికి ఇలాంటి ఆటో షోలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అందుకే మా విద్యార్థులను ఈ ఆటో షోకు ప్రిన్సిపాల్ అనుమతితో తీసుకొచ్చాం. ఇక్కడ మార్కెట్లో వస్తువులు విలువలు, విక్రయాలు చేసే విధానంతోపాటు పలు అంశాలను విద్యార్థులు తెలుసుకున్నారు. నిర్వాహకులైన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఆర్.ప్రవీణ్‌కుమార్, ఎన్జీ కళాశాల కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
జిల్లాలో మారుతీ సుజికి పవన్ మోటార్స్‌లో 2023 డిసెంబర్ నెలలో 400కు పైగా కార్ల అమ్మకాలు జరిగాయి. ఒక్క నెలలోనే ఇన్ని కార్ల అమ్మకాలు జరుగడంలో మా ఉద్యోగుల కృషి చాలా ఉంది. 2011లో నల్లగొండలో పవన్ మోటార్స్ ప్రారంభమైంది. నేడు మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పల్, కొండమల్లేపల్లి, శేరిలింగంపల్లి, లింగంపల్లి, రాయదుర్గ్, ఇబ్రహీంపట్నం, సఫిల్‌గూడ, మల్కాజిగిరిలో విస్తరించాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు ఆటో షో ఏర్పాటు చేయడం మా లాంటి షోరూమ్‌లకు ఎంతో ఉపయోగకరం. సామాన్యుడికి కార్ల వివరాలు, రుణాలు, కొనుగోళ్లు చేరువ చేయడంలో ఆటో షోలు దోహదపడుతాయి.
– కోమటిరెడ్డి చంద్రపవన్రెడ్డి, పవన్ మోటార్స్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్
మార్కెట్లో నెక్సా వాహనాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. మారుతీ పవన్ మోటార్స్, పవన్ నెక్సాలలో ఎప్పటికప్పుడు అధునాతన హంగులతో నూతన కార్లు విడుదల చేస్తూ వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో గ్రాండ్ వీటారకు మంచి ఆదరణ ఉంది. రూ.13 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు వివిధ మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. మా స్టాల్‌కు సూమారు 50 మందికి పైగా వచ్చి వాహన వివరాలు తెలుసుకున్నారు. బుకింగ్స్ సైతం చేసుకుంటున్నారు. ఇది మంచి అవకాశం.
– రవిరెడ్డి, బిజినెస్ హెడ్, పవన్ మోటార్స్
మా బెనిలీ బైక్ షోరూం కూకట్‌పల్లిలో ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు ఆటో షోలు పెట్టడం వల్ల గతంలో ఖమ్మంలో, ప్రస్తుతం నల్లగొండలో స్టాల్ పెట్టాం. ఈ షోలో పాల్గొనడం వల్ల మా బైకులకు మంచి ఆదరణ లభించింది. చాలా మంది యువకులు మా స్టాల్‌కు వచ్చి బైక్‌లను టెస్ట్ డ్రైవ్ చేశారు. రూ.7లక్షలతో 502 సీసీ బైక్, కే300ఎన్ బైక్ రూ.3లక్షలకు లభ్యం అవుతున్నాయి. ఈ షో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– సాయిప్రకాశ్, బెనిలీ బైక్ షోరూం ప్రతినిధి, హైదరాబాద్
నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ఆటో షోకు వచ్చి కుశాల్ హోండా స్టాల్‌ను సందర్శించా. మంచి ఆఫర్‌తో యాక్టివా హెచ్ స్మార్ట్ ఇస్తామన్నారు. ఈ వాహనంలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన కొద్ది సమయంలోనే తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. రూ.1,10,000కు వచ్చింది. బండిని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– జె.వెంకన్న, రైతు, పజ్జూరు, తిప్పర్తి మండలం
నేటి ఆధునిక కాలంలో ఇతర కంపెనీల కంటే హుందాగా ఉండే వెహికిల్‌గా మా బైక్‌లకు మార్కెట్లో మంచి స్పందన ఉంది. అయితే మా కంపెనీ బైక్స్ బుల్లెట్‌ను పోలి ఉంటాయి. మరో వైపు కూలింగ్ రేడియేటర్ ఉండటంతో ఎంత దూరం ప్రయాణం చేసినా వాహనదారుడికి ఇబ్బంది ఉండదు. 2014 నుంచి రీ మోడల్స్‌లో నూతన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేసిన వెంటనే బైక్ అందజేస్తాం. ఆటో షోలో మా స్టాల్ సందర్శించే వారికి ప్రత్యేక కూపన్ ఇస్తున్నాం. కూపన్స్ అని కలిపి డ్రా తీసి గెలిచిన వారికి గిఫ్ట్ ఇస్తాం. సద్వినియోగం చేసుకోవాలి.
– కంచర్ల హరిప్రసాద్‌రెడ్డి, జావా ఎజ్డీ షోరూం మేనేజర్, నల్లగొండ
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఖాతాదారులకు అన్ని రకాల రుణాలు అందజేస్తున్నాం. రైతులకు పంట రుణాలు, ద్విచక్ర వాహనాలకు లోన్లు ఇస్తున్నాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు ఆటో షో ఏర్పాటు చేయడం, ఇందులో మా బ్యాంకు స్టాల్‌కు అవకాశం కల్పించడం సంతోషకరం.
– కె.సంజీవరెడ్డి, డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్
గ్రామాల్లో రైతులు వ్యవసాయ అవసరాలకు టాక్టర్లు కొనాలని ఉన్నా.. వాటిని ఎంపిక చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఆటో షోలు పెట్టడం ద్వారా ఒకేచోట పలు ట్రాక్టర్లు, రుణాలు అందించే బ్యాంకులు ఉండడంతో వారికి చాలా సులువుగా ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంత వాహనాలను కొనుగోలు చేసే కల నెరవేర్చుకునే అవకాశం ఉంది.
– కృష్ణ, సోమనాథ్ ట్రాక్టర్ షోరూం మేనేజర్