తుంగతుర్తి, జూన్ 24 : తుంగతుర్తి మండల ఎంపీడీఓ (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) గా సిహెచ్ చలపతి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ ఎంపీడీఓగా పని చేస్తున్న శేషు కుమార్ పదోన్నతిపై ఇబ్రహీంపట్నంకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చలపతి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తుంగతుర్తి మండల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఇందుకు అంతా సహకరించాలని కోరారు. అనంతరం పలువురు అధికారులు ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.