బుద్ధవనం అద్భుత పర్యాటక ప్రాంతం
బుద్ధవనం అద్భుత పర్యాటక ప్రాంతమని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు.
- టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి
నందికొండ, జూలై 21 : బుద్ధవనం అద్భుత పర్యాటక ప్రాంతమని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు. బుద్ధవనంలో ఆదివారం ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవాన్ని నిర్వహించగా ఆయనతోపాటు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, టూరిజం ఎండీ ప్రకాశ్‌రెడ్డి, భూటాన్ మాజీ విద్యాశాఖ మంత్రి ఆచార్య ఠాకూర్ సింగ్ పౌడ్యేల్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుద్ధచరిత వనంలో బుద్ధుడి పాదాలకు, మాహా స్థూపంలోని అచార్య నాగార్జునుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహాస్థూప మందిరంలో ధ్యానం చేశారు. ఈసందర్భంగా పటేల్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు కఠోర సాధన తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడై తాను అనుభవ పూర్వకంగా తెలుకున్న నాలుగు సత్యాలను, ఆర్య అష్టాంగ మార్గాన్ని, మధ్యేమార్గం, ప్రతీత్య సముత్పాదమనే ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని ఆషాడ పూర్ణిమ నాడు తన శిష్యులకు బోధించాడని, ఆ రోజును ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
273 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని బుద్ధుడి పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నందికొండలోని బుద్ధవనం రానున్న రోజుల్లో విరాజిల్లుతుందన్నారు. అనంతరం బుద్ధువనం విశేషాలను తెలియపరిచే పోస్టర్లును విడుదల చేసి, ముఖ్య అతిథులకు జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ, బుద్ధవనం ఓఎస్డీ సుధాన్‌రెడ్డి, బుద్ధవనం నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం సహాయక శిల్పి శ్యామ్‌సుందర్, ఏఈ నజీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

