ఎమ్మెల్యే అయిలయ్య అక్రమాస్తుల నిగ్గు తేల్చాలి..!
అధికార దుర్వినియోగం చేస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో కలిసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ఫిర్యాదు చేశారు.
- యాదగిరిగుట్ట సీఐకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ముఖ్య నేతలు
యాదగిరిగుట్ట, అక్టోబర్ 28:అధికార దుర్వినియోగం చేస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో కలిసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ఫిర్యాదు చేశారు. అయిలయ్య అక్రమాస్తుల ఆరోపణలపై దృష్టి మళ్లించేందుకే ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే అయిలయ్య తదితరులు మాజీమంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు చేశారన్నారు.
ఎమ్మెల్యే స్వగ్రామమైన సైదాపురం మాసాయిపేట రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 726లో సుమారు 1500 ఎకరాల భూమిని, రైతులను మోసగించి స్పెక్ట్రా వెంచర్‌కు విక్రయించారన్నారు. సదరు వెంచర్‌ను డెవలప్ చేస్తామని, ప్లాట్లు విక్రయించి కస్టమర్లను మోసం చేశారన్నారు. వెంచర్‌ను డెవలప్ చేయకపోవడంతో కస్టమర్లకు ప్లాట్లు ఎకడున్నాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యే చేసిన మోసంతో కస్టమర్లకు ప్లాట్లు దొరకడం లేదని దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. రాజపేట మండలంలోని చల్లూరులో సర్వేనెంబర్ 322 లో 600 ఎకరాలు సీలింగ్ భూమిని ఎలాంటి డాక్యుమెంట్లు లేకుం డా అక్రమంగా తన పేరున క్రమబద్ధీకరించుకున్నాడని గుట్ట సీఐ భాసర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం సుమారు రూ.200 కోట్ల విలువచేసే 100 ఎకరాల భూములను అక్ర మ మార్గంలో సంపాదించాడంటూ తురపల్లికి చెందిన ఓ వ్యక్తి ఏసీ బీ, ఆదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడని, దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలన్నారు. బొమ్మలరామారం మండలంలోని రంగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారు 20 ఎకరాల భూమి వివాదంలో ఉండగా సెటిల్మెంట్ చేసి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలో ఎలాంటి అనుమతులు, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే క్రషర్ నిర్మా ణం చేపట్టారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు.
హైదరాబాదులోని ఉప్పల్ చెరువుకట్ట వద్ద ఎకరం భూమి, నాగోల్‌లోని రూ. 13 కోట్ల భవనం, బంజారాహిల్స్ లోని రూ. 13 కోట్ల విలువైన స్తిరాస్తులను ఎమ్మెల్యే ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. గుట్ట కొండ కింద ఉన్న పారింగ్, చెరువు హెలిప్యాడ్ ప్రాంతంలో మట్టి పూడ్చేందుకు చేపట్టిన కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడి సుమారు రూ.50 కోట్లు స్వాహా చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, చొల్లేరు మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, అంకం నరసింహ, పేరబోయిన సత్యనారాయణ, కొన్యాల నరసింహారెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

