Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
Rakesh Reddy | ఆదివారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై అవగాహన కల్పిస్తూ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలిపించాలని పట్టభద్రులను కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
Rakesh Reddy | కోదాడ : జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొండిచేయి చూపిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పైడిమర్రి సత్యబాబు విమర్శించారు.
ఆదివారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై అవగాహన కల్పిస్తూ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలిపించాలని పట్టభద్రులను కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంపిక చేసిన ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డికి ఉందన్నారు.
శాసనమండలిలో తన వాణిని వినిపించి విద్యార్థి యువత సమస్యలు పరిష్కరించే సత్తా ఆయనకు ఉందన్నారు. వాస్తవాలను గమనంలోకి తీసుకొని పార్టీలకతీతంగా యువత, విద్యావంతుడు రాకేష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ చీమ నరేష్ ఉపేందర్ గౌడ్, కరీముల్లా, అలవాల వెంకట్ ,బత్తుల ఉపేందర్ ,సాధిక్ , చలిగంటి వెంకట్, అబ్బు శ్రీకాంత్, రాజు నాగుల్, రాజేష్, రమేష్ సైదులు, నరసయ్య, సిద్దు, వీరబాబు, శంబయ్య, శ్రీను, సుధాకర్, వెంకన్న పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Read Also :
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

