అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ నల్లగొండ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల
తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్స్ సోసైటీ (టీజీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్) సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన కాంప్లియెన్స్ 2కె 26 రాష్ట్రస్థాయి పోటీల్లో నల్లగొండలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల..
రామగిరి, మార్చి 20 : తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్స్ సోసైటీ (టీజీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్) సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన కాంప్లియెన్స్ 2కె 26 రాష్ట్రస్థాయి పోటీల్లో నల్లగొండలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించి సత్తా చాటింది. ఈ పోటీల్లో అథ్లెటిక్స్ విభాగంలో ఎన్.ప్రవళిక (బీజడ్సీ థర్డ్ ఇయర్) 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల విభాగం, లాంగ్ జంప్‌లో బంగారు పతకాలు సాధించింది. అలాగే 4×100 మీటర్స్ రిలేలో కాంస్యంతో పాటుగా అథ్లెటిక్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ సహితం దక్కించుకుని కీర్తి చాటింది. అదే విధంగా ఎ. అఖిల (బీజడ్పీ సెకండ్ ఇయర్) 3కె రన్లో సిల్వర్ అలాగే 4×100 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. కె.రాజరాజేశ్వరి (బీజడ్సీ 2వ సంవత్సరం) – షాట్‌పుట్‌లో బంగారం, 4x 100 మీటర్ రిలేలో కాంస్య పతకాన్ని సాధించింది.
దీంతో పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల నల్లగొండ ‘ఓవరాల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్’ను సాధించిందని వెల్లడించారు. అదే విధంగా ఎంపిసిఎస్ ధర్డ్ ఇయర్ విద్యార్థిని రాధిక ‘లిటరరీ క్విజ్’లో మొదటి బహుమతిని, ఎంపిసిఎస్, ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మునీటా పద్య గేయంలో రెండవ బహుమతిని, బీజడ్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని నిఖిత వ్యాసరచనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. దీంతో శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర్ష, అధ్యాపకులు అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

