Kite | పతంగులు ఎగురవేస్తున్నారా.. జర జాగ్రత్త
సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలి పటాలు కూడా అంతే. ఈ పండుగ సమయాల్లో గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందించడం రివాజు.
Kite | నేరేడుచర్ల, జనవరి 14 : సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలి పటాలు కూడా అంతే. ఈ పండుగ సమయాల్లో గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందించడం రివాజు. పట్టణ ప్రాంతాల్లో గాలి పటాలు ఎగురవేసే సంస్కృతి కొద్దిమేర తగ్గినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉన్నది. గాలి పటం ఎగురవేసే సమయంలో ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఈ సమయంలో గోడలు, మిద్దెలు, ఎత్తైన భవనాలు, మైదానాల నుంచి ఎగురవేస్తూ ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. విద్యుత్ తీగలకు చుట్టుకున్న గాలి పటాలను తొలగించే ప్రయత్నంలోనూ విద్యుదాఘాతానికి గురైన సంఘటనలూ చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది.
ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గాలి పటాలు ఎగురవేయడంలో ఆనందం ఉంటుంది. దీంతోపాటు అజాగ్రత్తగా ఉంటే ఎనలేని దుఃఖం దరిచేరుతుంది. గాలి పటాలు ఎగురవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్ వంటివి చుట్టుకోవాలి. దీని వల్ల మాంజా పూసిన దారం వల్ల చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అయితే గాయాన్ని శుభ్రంగా కడగాలి. రక్తస్రావం ఆగేందుకు బ్యాండేజీతో కట్టేసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గాలి పటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగురవేయడమే మేలు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

