అనురాగ్ ‘నల్లగొండ నైట్స్’ జెర్సీ ఆవిష్కరణ
టీజీ 20 లీగ్లో నల్లగొండ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు జెర్సీని శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు చెందిన..
నల్లగొండ రూరల్, జూన్ 05 : టీజీ 20 లీగ్లో నల్లగొండ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు జెర్సీని శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు చెందిన 25-30 క్రికెట్ అకాడమీల నుంచి 700 మందికి పైగా యువ క్రికెటర్లు, 60 మందికి పైగా కోచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనురాగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రాటజీ అనురాగ్ పల్లా గ్రామీణ ప్రాంతాల నుండి వెలుగులోకి వస్తున్న క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించేందుకు అనురాగ్ యూనివర్సిటీ దీర్ఘకాలిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
యువ క్రీడాకారులకు కోచింగ్, శిక్షణా సదుపాయాలు, ప్రాక్టీస్ మ్యాచ్లు, టాలెంట్ ఐడెంటిఫికేషన్ అవకాశాలను అందిస్తూ వారి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సీజన్ కే పరిమితం కానీ, రాబోయే ఐదేళ్ల పాటు కొనసాగనున్న దీర్ఘకాలిక కార్యక్రమం అని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో టాలెంట్ హంట్లు, ఇంటర్ అకాడమీ టోర్నమెంట్ల నిర్వహణపై కోచ్లు, విద్యార్థులు చేసిన సూచనలను స్వాగతిస్తూ వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అనురాగ్ నల్లగొండ నైట్స్ హెడ్ కోచ్ డి.బి. రవితేజ యువ ఆటగాళ్లతో ప్రత్యేకంగా మమేకమై ఫిట్నెస్, నైపుణ్యాల అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ఆటలో నిరంతర మెరుగుదల వంటి అంశాలపై విలువైన సూచనలు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫిట్నెస్కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జట్టు అసిస్టెంట్ కోచ్ రోనాల్డ్ రోడ్రిగ్స్, ఫిజియో, టైనర్, మేనేజర్, మెంటర్ తదితర సపోర్ట్ స్టాఫ్ను పరిచయం చేశారు. అనంతరం అనురాగ్ నల్లగొండ నైట్స్ అధికారిక జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా అనురాగ్ యూనివర్సిటీ, ప్రాంతీయ క్రికెట్ వర్గాల మధ్య బలమైన భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టబడింది. యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ప్రాంతీయ క్రికెట్ అభివృద్ధికి ఈ కార్యక్రమం కీలకంగా నిలువనుందని పలువురు పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

