నమస్తే తెలంగాణ, నల్లగొండ : నల్లగొండ పట్టణంలో అన్నపూర్ణ క్యాంటీన్‌ను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఇందులో 5 రూపాయలకే భోజనం అందించనున్నారు.
పచ్చని చెట్ల నడుమ భోజనం వడ్డించేందుకు రూము నిర్మించి, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆ దారి గుండా వెళ్లే వారిని నిర్మాణ పనులు ఆకట్టుకుంటున్నాయి.