అతిథి అధ్యాపకుల నియామకానికి విద్యార్హత సవరణ
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్లగొండలో ఈ నెల 22న వెల్లడించిన పత్రికా ప్రకటనకు అదనపు కొనసాగింపుగా 2026-27 విద్యా సంవత్సరానికి రెండు AEDP విభాగాలలో ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు...
– ఈ నెల 31 లోగా దరఖాస్తులకు అవకాశం
రామగిరి, ఆగస్టు 27 : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్లగొండలో ఈ నెల 22న వెల్లడించిన పత్రికా ప్రకటనకు అదనపు కొనసాగింపుగా 2026-27 విద్యా సంవత్సరానికి రెండు AEDP విభాగాలలో ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరాజు తెలిపారు. హెల్త్ కేర్ మేనేజ్మెంట్ (UG) కు నిర్దేశించిన M.Sc. Zoology విద్యా ర్హతను సవరించి, ఇకపై M.sc. Health Care Management/M.Sc. Microbiology/M.Sc. Zoology లలో, అలాగే ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ (PME) కోర్సు (UG) కు సంబంధించి M. Pharmacy/M.Sc. Chemistry లలో, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులలో సాధారణ అభ్యర్థులు కనీసం 55% మార్కులు, SC/ST అభ్యర్థులు 50% మార్కులు కలిగి ఉండాలి.
NET/SET/Ph.D అర్హతతో పాటు బోధనానుభవానికి అదనపు వెయిటేజీ ఇవ్వబడుతుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని తెలిపారు.. వారి దరఖాస్తులను సవరించిన విద్యార్హతల ప్రకారం పరిగణనలోకి తీసుకోబడుతుంది. సవరించిన విద్యార్హతల ప్రకారం కొత్తగా దరఖాస్తులు 31.08. 2026 సాయంత్రం 5:00 గంటల వరకు, కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో స్వీకరించబడతాయని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంపాదించాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

