కొత్తిమీర.. లాభాల పంట
బతుకుదెరుపు కోసం వలస వచ్చి కొత్తిమీర సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బల్లికురువ మండలం కొణిదేన గ్రామానికి చెందిన సాన మురళి, కోటేశ్వరి భార్యాభర్తలు.
చౌటుప్పల్, డిసెంబర్ 8 : బతుకుదెరుపు కోసం వలస వచ్చి కొత్తిమీర సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బల్లికురువ మండలం కొణిదేన గ్రామానికి చెందిన సాన మురళి, కోటేశ్వరి భార్యాభర్తలు. ఇద్దరు పిల్లలతో కలిసి 4 సంవత్సరాల క్రితం చౌటుప్పల్‌కు వలస వచ్చారు. మొదట గానుగు నూనెల వ్యాపారం చేసిన వారు పెద్దగా లాభాలు లేకపోవడంతో వ్యవసాయంపై దృష్టి సారించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు, భూగర్భ జలాలు మెండుగా ఉండటంతో కొత్తిమీర సాగు చేపట్టారు. వరి సాగు చేస్తే నెలల తరబడి పంట కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకు పెట్టుబడి కూడా ఎక్కువే. కొత్తిమీర ఖర్చు తక్కువ, నిత్యం ఆదాయం పొందవచ్చని ఆలోచించారు.
ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. తాత్కాలికంగా డ్రిప్ ఏర్పాటు చేసుకొని తక్కువ నీటితో కొత్తిమీర సాగు చేశారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. రెండు ఎకరాల్లో ఏడాది పొడవునా పంట తీస్తున్నారు. రోజూ ఉదయం 5గంటలకు కొత్తిమీర కోసి కట్టలు కట్టి చౌటుప్పల్ మార్కెట్లో విక్రయిస్తారు. అవసరమైన వినియోగదారులకు పొలం వద్ద కూడా అమ్ముతారు. దాంతో నిత్యం రూ.1500కు పైగా ఆదాయం పొందుతున్నారు. మధ్యాహ్నం తర్వాత పంటకు కావాల్సిన నీటి సరఫరా, కలుపు మొక్కల తొలగింపు, ఇతర పనుల్లో నిమగ్నమవుతారు.
వరి సాగు చేస్తే నెలలపాటు ఎదురు చూడాలి
వరి పంట సాగు చేస్తే నాలుగు నెలలు ఎదురు చూడాలి. పెట్టుబడి కూడా ఎక్కువ. కొత్తిమీర సాగు చేస్తే 45 రోజుల్లోనే చేతికొస్తుంది. ఇప్పుడు రోజూ రూ.1500 వరకు ఆదాయం వస్తున్నది. ఖర్చులు తక్కువే. అందుకనే కొత్తిమీర సాగు చేస్తున్నాం. రెండు ఎకరాల్లో నాలుగు లేయర్లు ఏర్పాటు చేశాం. ప్రతి ఏడాది 4-5పంటలు తీస్తున్నాం.
– సాన కోటేశ్వరి
కొత్తిమీరతో మంచి ఆదాయం వస్తున్నది
నాలుగేండ్ల కింద చెక్క గానుగ నూనెల వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చాం. అందులో అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదు. మూడేండ్లు అదే కొనసాగించాం. లాభాలు అంతంతమాత్రమే ఉండడంతో కొత్తిమీర సాగుపై దృష్టి సారించాం. రెండెకరాలు లీజుకు తీసుకొని కొత్తిమీర సాగు చేశాం. ప్రతిసారీ దున్నకానికి, విత్తనాలకు, ఎరువులు, కొన్ని డ్రిప్ పైపులు మార్చడంతోపాటు ఇతర ఖర్చులకు రూ.15వేల వరకు అవుతుంది. కొత్తిమీర పంట చేతికొచ్చాక రోజూ రూ.1500 వరకు వస్తుంది. ఖర్చులు పోను నెలకు రూ.30వేలు మిగులుతుంది. మార్కెట్‌కు, కరెంట్‌కు ఏ ఇబ్బందీ లేదు. కూరగాయల వ్యాపారులు పొలం దగ్గరికి కూడా వచ్చి కొనుగోలు చేస్తారు. పండుగలు, పెండ్లిళ్ల సమయంలో హైదరాబాద్ నుంచి వస్తారు. రోజూ చేతినిండా పని దొరుకుతుంది. మా ఇద్దరికీ కూలి పడుతుంది.
– సాన మురళి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

