లక్ష రుణం వారి జాబితా బయట పెట్టాలి
లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు తొలి విడుత మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జాబితాను బయట పెట్టాలని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- గతంలో 1,046 కోట్లు ఇస్తే.. ఇప్పుడు రూ.947 కోట్లు ఇవ్వడమేంటి?
- జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి
నల్లగొండ, జూలై 19: లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు తొలి విడుత మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జాబితాను బయట పెట్టాలని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీ చేస్తామని ప్రతి రైతుకు రూ.99,999 వరకు అమలు చేసిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిందని.. అప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1.65 లక్షల మంది రైతులకు రూ.1,045 కోట్లు మాఫీ అయ్యాయని తెలిపారు. మరి ఇప్పుడు 1.76 లక్షల మందికి లక్ష మాఫీ చేస్తే రూ.945 కోట్లు మాత్రమే ఎందుకు మాఫీ అవుతాయని ప్రశ్నించారు. ఎంతమందికి ఎంత రుణమాఫీ చేశారు, మిగతా వారిని ఏ కారణాలతో పక్కకు పెట్టారు? వాటి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
రైతు బంధును పక్కన పెట్టి ఆ డబ్బును రుణమాఫీకి ఇవ్వడం సరికాదన్నారు. రైతు రుణమాఫీని అమలు చేశామంటూ హరీశ్‌రావును రాజీనామా చేయమనడం అర్థం లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 13 అంశాలు అమలు చేస్తే ఆయన రాజీనామా చేస్తారన్నారు. హరీశ్‌రావు రాజీనామాకు సవాల్ విసిరితే సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు రాజీనామాలు కొత్త కాదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను రెచ్చగొట్టి నోటిఫికేషన్లు రాకుండా కోర్టులు ఎక్కించిన కాంగ్రెస్ నేడు వారినే నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జునరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

