అన్నం పెట్టిన దర్శకుడికి విజయ్ సేతుపతి అశ్రునివాళి

ఈ రోజుల్లో మనిషి బతికున్నప్పుడు చేసిన మేలు ఎవరూ గుర్తుంచుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలో కృతజ్ఞత అనేది ఉండదు అని చాలా మంది ప్రముఖులు చెబుతూనే ఉంటారు. గుర్తింపు రాక ముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరోకలా మారిపోయే వాళ్ళు చాలామంది మన ఇండస్ట్రీలో ఉన్నారు అంటూ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే మాట. కానీ కొందరు మాత్రం తమ ఎదుగుదలకు ఉపయోగపడిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. వాళ్లకు కృతజ్ఞత భావం చూపిస్తుంటారు. అలాంటి వాళ్ళలో రియల్ హీరో విజయ్ సేతుపతి కూడా ఒకడు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో విజయ్ సేతుపతికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కోసం బాలీవుడ్ దర్శకులు కూడా వేచి చూస్తున్నారు.
కదులుతున్న కారుపై పుషప్స్.. పోలీసులు ఏం చేశారో చూడండి!
ఇక సౌత్‌లో విజయ్ ఒక బ్రాండ్. ఈ రోజు ఈయన అనుభవిస్తున్న స్టార్ డమ్ వెనకాల ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో తిండి, నిద్ర లేక అల్లాడిపోయాడు విజయ్ సేతుపతి. అలాంటి పరిస్థితుల్లో ఈ హీరోను ఆదుకున్నది దివంగత దర్శకుడు ఎస్పీ జననాథన్. మార్చి 14న ఈయన గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన హఠాన్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఈ జాతీయ అవార్డు గ్రహీత చివరి సినిమా విజయ్ సేతుపతితోనే చేశాడు. లాభం పేరుతో వ్యవసాయ నేపథ్యంలో జననాథన్ సినిమా తెరకెక్కించాడు.
ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి కెరీర్ కొత్తలో జననాథన్ ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాడు. అది గుర్తు పెట్టుకున్న విజయ్ ఈ దర్శకుడు చనిపోయినప్పుడు అందరికంటే ముందు స్పందించాడు. వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆయన అంతిమ సంస్కారాలు పూర్తయ్యేవరకు కుటుంబంతో పాటు ఉన్నాడు. తాను ఒక స్టార్ హీరో అనే సంగతి మర్చిపోయి సామాన్యుడిలా అక్కడ అందరితో కలిసిపోయి.. ఆ దర్శకుడి కోసం కన్నీళ్ళు కార్చాడు. ఏదేమైనా విజయ్ సింప్లిసిటీ చూసి అక్కడున్న వాళ్ళు ప్రశంసల వర్షం కురిపించారు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

