ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?

పద్మశ్రీ.. బయట ప్రేక్షకులలో కాదు కానీ.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దానికి కారణం ఆయన తెరకెక్కించిన ‘షాదీ ముబారక్’ సినిమా. ఈ రోజుల్లో ఒక సినిమా చేయడానికి కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ కొత్త దర్శకుడు పద్మశ్రీ మాత్రం ఒక అందమైన కథ రాసుకొని.. కారులో సగం సినిమా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ‘షాదీ ముబారక్’ సినిమాను నడిపించిన తీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలను ఆకట్టుకుంటుంది. మొగలిరేకులు, చక్రవాకం లాంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సాగర్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
స్క్రీన్ పై ఆయనను కూడా చాలా అందంగా చూపించాడు పద్మశ్రీ. ఇక హీరోయిన్ క్యారెక్టర్‌ను ఆయన తీర్చిదిద్దిన తీరు పలువురి ప్రశంసలందుకుంటోంది. ఐదేళ్ల కిందట విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఇప్పుడు ‘షాదీముబారక్’ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఇండస్ట్రీలోని కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో తెలియదు కానీ మరి మెరికల్లాంటి దర్శకుడిని దిల్ రాజు ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు అంటూ ఆయనను కూడా పొగుడుతున్నారు.
ఎలాంటి ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్‌లు లేకుండా చాలా సింపుల్ గా షాదీముబారక్ సినిమా తెరకెక్కించాడు పద్మశ్రీ. దిల్ రాజు విడుదల చేయడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. పైగా మార్చి 5 శుక్రవారం విడుదలైన 9 సినిమాలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఏకైక సినిమా ఇదే. ప్రమోషన్ కాస్త గట్టిగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా లాభాల పంట పండిస్తుందని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న రిపోర్ట్. ఏదేమైనా కూడా పద్మశ్రీ ఖచ్చితంగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

