Mehendi | మైదాకుపై మహిళల మక్కువ.. మందారంలా పండితే మంచి మొగుడొస్తాడట..!
Mehendi | చేతులకు మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. అందుకే మైదాకును ఇష్టపడని మగువలు ఉండరు. ఆషాఢ మాసంలో కొత్త పెండ్లికూతుళ్లు కన్నవారింటికి వెళ్లిపోవడం, మైదాకుతో చేతులను అందంగా ముస్తాబు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
Mehendi | ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేతా మొగ్గా తొడిగేలా..’ అన్నాడు ఓ సినీ కవి. మైదాకుతో ఎర్రగా పండిన అరచేతులు, పాదాలను చూసుకొని మురిసిపోని ఆడవారు ఉండరేమో! మైదాకు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయ కోణంతోపాటు పరమార్థం కూడా ఉంది. మైదాకు సహజ సౌందర్యాన్నే కాక, ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది.
చేర్యాల/మెదక్ అర్బన్, జూలై 15 : చేతులకు మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. అందుకే మైదాకును ఇష్టపడని మగువలు ఉండరు. ఆషాఢ మాసంలో కొత్త పెండ్లికూతుళ్లు కన్నవారింటికి వెళ్లిపోవడం, మైదాకుతో చేతులను అందంగా ముస్తాబు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో మహిళలు మైదాకు పెట్టుకునేందుకు మక్కువ చూపుతారు. ఇది ఆచారంగానూ, సంస్కృతిలో భాగంగానూ భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకునేందుకు మహిళలు, యువతులు ఇష్టపడతారు. సహజ సౌందర్య సాధనమైన మైదాకుకు స్త్రీల అలంకరణ సాధనాల్లో ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు, యువతులు, చిన్న పిల్లలు మైదాకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఆషాఢ మాసంలో గ్రీష్మ రుతువు పూర్తయి, వర్ష రుతువు ప్రారంభమవుతుంది. ఈ రుతువులోని వేడికి మన శరీరం వేడిగా మారుతుంది.
శ్రావణం ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లగా అవుతుంది. వాతావరణంలోని చల్లదనం, శరీరంలోని వేడితో అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మైదాకు పెట్టుకోవడం ద్వారా శరీరంలోని వేడి తగ్గి, ప్రకృతికి అనుకూలంగా శరీరం తయారవుతుంది. మైదాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాఢ మాసంలో మైదాకు కచ్చితంగా పెట్టుకోవాలనే సంప్రదాయాన్ని పూర్వీకులు తీసుకువచ్చినట్లు పెద్దలు చెబుతారు. పండుగలు పబ్బాల్లో మైదాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కాలానుగుణంగా, కోన్లు, పౌడర్ల వాడకం పెరుగుతున్నా.. అరచేతులే కాన్వాసుగా పరిమళభరితమైన చిత్రాల్ని ప్రకృతి సిద్ధంగా ఆవిష్కరించే మైదాకుకే మహిళలు పెద్దపీటవేస్తున్నారు. మందారంలా పండితే మంచి మొగుడొస్తాడు లాంటి సెంటిమెంట్ల మాటెలా ఉన్నా కొద్దిరోజులపాటు చేతులను కళాకృతులుగా మార్చుకునే ఈ ముచ్చట ఆషాఢ మాసంలో విరబూస్తుంది.
కోన్లతో నష్టమే..
ప్రస్తుతం మైదాకు స్థానంలో కోన్లు వచ్చి చేరాయి. రెడీమేడ్‌గా దొరికే ఈ మైదాకు అంత అందంగా, ఎర్రగా పండవు. పైగా నాసిరకం కోన్లతో చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మైదాకు చేతులకు ఎర్రగా ఉన్నన్ని రోజులు కోన్లు ఉండవు. అందుకే మైదాకే మేలు అని సూచిస్తున్నారు పెద్దలు.
ఔషధ గుణాలెన్నో..
మైదాకులో అనేక ఔషధ గుణాలున్నాయి. మైదాకు పువ్వు, ఆకులు, వేర్లు, విత్తనాలు, బెరడు అన్నీ కూడా ఔషధాలుగా ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై వచ్చే మంటను చల్లబరిచేందుకు, కొన్ని రకాల చర్మవ్యాధులు, చుండ్రును తగ్గించడంలోనూ, వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు, కేశాలంకరణలోనూ, ముఖ వర్చస్సుకు, నిద్రబాగా పట్టేందుకు మైదాకు ఉపయోగపడుతుంది. నెలలో కనీసం ఒక్కసారైనా మైదాకు పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
శాస్త్రీయ ప్రయోజనాలు
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందం, ఆనందం కోసం గోరింటాకు పెట్టుకోవడం మొదలైంది. కాలక్రమేణా పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. పెండ్లి అయిన వారైతే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు అంటుంటారు. అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలని పూర్వికులు అంటుంటారు.
ఇన్ఫెక్షన్ దూరం చేసేందుకు..
ఇంటిపనుల్లో ఎక్కువగా మహిళలు నీళ్లను వాడుతుంటారు. ఆషాఢ మాసంలో వానలు ఎక్కువగా కురుస్తాయి. తద్వారా పాదాలు, అరచేతులు ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో చేతులు, పాదాలకు దురదలు, చర్మం మంట, వేడిమి, అలర్జీ తదితర సంబంధిత రోగాలు వస్తాయి. చేతినిండా మైదాకు పెట్టుకోవడంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఆయుర్వేదంలో మైదాకును ఉపయోగించి అనేక రోగాలు నయం చేసేవారు. వానకాలంలో మైదాకు ఎక్కువగా కాస్తుంది.
ప్రాశస్త్యం అనాదిగా వస్తుంది
ఆషాఢంలో గోరింటా కు పెట్టుకోవడం అనాదిగా వస్తుంది. గోరింటాకు అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకాంబరీమాతగా అలంకరిస్తారు. మైదాకులో లక్ష్మీదేవి రూపాన్ని చూసుకుంటారు. ఆషాఢంలో శుభగడియలు లేకున్నా, వ్రతాలు, పూజలు చేసుకుంటారు.
-మర్మాముల రామంద్రమూర్తి, పురోహితుడు, చేర్యాల
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

