మెదక్ పట్టణంలో కారు బీభత్సం.. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు దుర్మరణం
మెదక్ పట్టణంలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
మెదక్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన రోడ్లు శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందిపైకి కారు దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద జరిగింది.
శనివారం తెల్లవారు జామున 5 గంటలకు పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో రాందాస్ చౌరస్తా నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆల్టో కారు (నంబర్ టీఎస్35 ఎఫ్ 9766) వారిని ఢీకొట్టింది. కారు బలంగా ఢీ కొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికిక్కడే దుర్మరణం చెందింది. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, రూరల్ సీఐ విజయ్ కుమార్, ఎస్ఐలు మల్లారెడ్డి, విఠల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఒకేసారి ఇద్దరు మున్సిపల్ కార్మికులు చనిపోవడంతో మెదక్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కార్మికులు పోలీసులను కోరారు. ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

