విద్యార్ధినులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు సాధారణంగా డబ్బుతో కూడుకున్న ఎన్నో విద్యలకు దూరంగా వుంటూ వారిలో దాగివున్న ప్రతిభను కనబర్చలేకపోతుంటారు. అలాంటి విద్యార్థినీ, విద్యార్థులకు మాస్టర్ పోచయ్య ఎంతో ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్‌లో ఉచితంగా శిక్షణనిస్తూ కొంతకాలంగా బాసటగా నిలుస్తున్నాడు.
- రోజూ మార్షల్ ఆర్ట్స్ , కిక్‌బాక్సింగ్, కుంగ్‌ఫూలో తర్ఫీదు
- ఉచితంగా శిక్షణనిస్తూ బాసటగా నిలుస్తున్న మాస్టర్ పోచయ్య
- 6 నుంచి పైతరగతుల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ప్రత్యేక క్లాసులు
- బెల్ట్ ఎగ్జామ్స్‌లో అమ్మాయిల ప్రతిభ
- విద్యను ప్రదర్శిస్తూ శభాష్ అనిపించుకుంటున్న విద్యార్థినులు
- ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్న సిరిపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
హత్నూర, జూలై 17: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు సాధారణంగా డబ్బుతో కూడుకున్న ఎన్నో విద్యలకు దూరంగా వుంటూ వారిలో దాగివున్న ప్రతిభను కనబర్చలేకపోతుంటారు. అలాంటి విద్యార్థినీ, విద్యార్థులకు మాస్టర్ పోచయ్య ఎంతో ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్‌లో ఉచితంగా శిక్షణనిస్తూ కొంతకాలంగా బాసటగా నిలుస్తున్నాడు. హత్నూర మండలం సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలు ఎంతో విలువైన కిక్‌బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, కుంగ్‌ఫూ, థైయిచి విద్యలో రాణిస్తున్నారు. సంవత్సరం నుంచి పాఠశాలలో కిక్‌బాక్సింగ్ ఇంటర్నేషనల్ కోచ్, వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, చీఫ్ ఎగ్జామినర్ పోచయ్య ఉచితంగా 6 నుంచి పైతరగతుల విద్యార్థినులకు ప్రతిరోజూ ఉదయం శిక్షణ ఇస్తున్నాడు. దీంతో పాఠశాలలో చదువుతున్న సుమారు 100మంది విద్యార్థినులు నిత్యం శిక్షణలో తర్ఫీదు పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో బెల్ట్ ఎగ్జామ్స్‌లో పాల్గొని ప్రతిభను చాటారు. పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రదర్శిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.
విద్యార్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థినులకు ఏడాదిగా కిక్‌బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, కుంగ్‌ఫూ వంటివిద్యల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్న. ఆత్మరక్షణకు, దేహదారుఢ్యానికి దోహదపడే విద్యను నేర్చుకోవడానికి విద్యార్థులు ముందుకురావాలి. ప్రతిరోజూ కొనసాగుతున్న శిక్షణలో విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరుస్తూ కిక్‌బాక్సింగ్ పోటీల్లో రాణిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో శిక్షణపొందిన విద్యార్థులు ఎన్నో పతకాలు సాధించారు. ప్రస్తుత సమాజంలో క్రీడలతో అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. క్రీడల్లో రాణిస్తున్న ఎంతోమంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో సాధిస్తున్నారు. పరిసర గ్రామాల విద్యార్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.
– పోచయ్య, కిక్‌బాక్సింగ్ ఇంటర్నేషనల్ కోచ్
ఉచితంగా శిక్షణ ఇవ్వడం హర్షణీయం
కిక్‌బాక్సింగ్‌లో ఇంటర్నేషనల్ కోచ్ పోచయ్య పాఠశాలకొచ్చి విద్యార్థినులకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ప్రస్తుతం సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఇలాంటి ఆత్మరక్షణ శిక్షణలు ఎంతగానో దోహదపడుతాయి. విలువైన సమయాన్ని వదులుకొని పేదవిద్యార్థినులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న మాస్టర్ పోచయ్యకు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు. – సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిరిపురం
ఆత్మరక్షణకు దోహదపడుతుంది
కిక్ బాక్సింగ్, కుంగ్‌ఫూ అమ్మాయిలకు ఆపత్కాలంలో ఆత్మరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది. మూడు నెలలుగా ఉచితంగా శిక్షణ పొందుతున్న. దీంతో ఎలాంటి సమయంలోనైనా నన్ను నేను రక్షించుకోగలనన్న నమ్మకం ఏర్పడుతుంది. రోజూ శిక్షణ ఇస్తున్న మాస్టర్‌కు కృతజ్ఞతలు.
– జయంతి, 10వ తరగతి విద్యార్థిని
ఐపీఎస్ అవుతా..
ఉన్నత చదువులు చదివి ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. ఆ లక్ష్యానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. అందులో శిక్షణ పొందుతున్న. ఎలాంటి ఫీజు లేకుండా ప్రతిరోజూ శిక్షణ ఇస్తున్న మాస్టర్‌కు రుణపడి ఉంటా.
– సుప్రియ, 10వ తరగతి విద్యార్థిని
జాతీయ స్థాయిలో రాణిస్తా
మూడు నెలలుగా నేను చేస్తున్న కఠోరసాధన చేస్తున్న. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తాననన్న నమ్మకం ఏర్పడింది. మా అమ్మానాన్నలు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తా.
– శృతి, 9వ తరగతి విద్యార్థిని
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

